Monday, December 16, 2019

What is gratuity and explanation



Read also:

ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన విషయం.గ్రాట్యుటీ అంటే ఏమిటి ? ఎంత చెల్లిస్తారు.
గ్రాట్యుటీ అంటే ఏమిటి-ఎంత చెల్లిస్తారు.
ఏళ్ల తరబడి చేసిన పనికి ప్రతిఫలంగా కంపెనీ చెల్లించే మొత్తమే 'గ్రాట్యుటీ', రిటైరయ్యాకనో, ఉద్యోగం వదిలేస్తేనో లేదా ఉద్యోగం నుంచి తొలగిస్తేనో.కంపెనీ ఆ వ్యక్తికి గ్రాట్యుటీని చెల్లిస్తుంది.
ఏదైనా సంస్థలో పనిచేసిన ఉద్యోగి ఉద్యోగం మానేసినా, రిటైరైనా గ్రాట్యుటీ రూపంలో కొంత మొత్తాన్ని పొందుతారు. 1972లో గ్రాట్యుటీ చెల్లింపు చట్టం (పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972) రూపొందించింది. దీని ప్రకారమే కంపెనీలు నిర్ధారిత నియమాలు, షరతులకు లోబడి, ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపులు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలు ఉద్యోగులు, సంస్థలు.ఇద్దరికీ వర్తిస్తాయి. ఏడాదికీ, రెండేళ్లకే ఉద్యోగాలు మారుతుంటే మీకు గ్రాట్యుటీ ఎప్పటికీ అందని ద్రాక్ష, ఏదైనా కంపెనీలో ఐదు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు పనిచేసినవారే గ్రాట్యుటీకి అర్హులవుతారని చట్టం చెబుతోంది.  ప్రభుత్వ పెన్షన్ పోర్టల్ ప్రకారం.గ్రాట్యుటీ అనేది 15 రోజుల బేసిక్ శాలరీ, డీఏల మొత్తానికి సమానం. ఇది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది వేతనం, రెండోది ఎంతకాలం పనిచేశారనే సర్వీస్ పీరియడ్. ఆరునెలలు అంతకన్నా ఎక్కువ కాలం ఉన్నసమయాన్ని సంవత్సరంగానే లెక్కిస్తారు. ఎన్ని సంవత్సరాలు పనిచేశారో అంత కాలానికి ఏడాదికి 15 రోజుల బేసిక్ శాలరీ, డీఏలను లెక్కించి, దీన్ని చెల్లిస్తారు.
గ్రాట్యుటీకి కనిష్ట పరిమితి ఆంటూ ఏమీ లేదు. కానీ గరిష్ట పరిమితి రూ.20 లక్షలు. ఉద్యోగం మానేసినా, రిటైర్మెంట్ తర్వాత ఆయినా 30 రోజులలోపు గ్రాట్యుటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కంపెనీ అయినా గ్రాట్యుటీ చెల్లించకపోయినా లేదా చెల్లించాల్సిన దానికన్నా తక్కువ చెల్లించినా ఆసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :