Tuesday, December 3, 2019

Wages to rise in new year



Read also:

కొత్త ఏడాదిలో పెరగనున్న వేతనాలు.ఎంతంటే

ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న భారత్ కు ఒక గుడ్ న్యూస్. మన దేశంలో కొత్త ఏడాది .అంటే 2020 లో వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఈ పెరుగుదల మొత్తం ఆసియా లోనే అత్యధికం కావటం విశేషం. ఉద్యోగాలు పోవటమే కానీ రావటం వినిపించని ఈ సమయంలో వేతనాలు పెరుగుతాయన్న విషయం నిజంగా శుభవార్తే కదా? కార్న్ ఫెర్రీ అడ్వైసోరీ ఇండియా అనే సంస్థ ఆసియాలోని వివిధ దేశాల్లో 2020 సంవత్సరంలో వేతనాల పెరుగుదల పై ఒక సర్వే నిర్వహించింది.
అందులో భారత్ ముందు ఉంది. ఈ సర్వే ప్రకారం 2020 లో అన్ని దేశాలకంటే అధికంగా భారత్ లో 9.2% వేతనాలు పెరుగనున్నాయి. మన దేశం తర్వాత 8.1% పెరుగుదలతో ఇండోనేషియా రెండో స్థానంలో నిలిచింది. పొరుగు దేశం చైనా లో వేతనాల పెరుగుదల రేటు కేవలం 6% మాత్రమేనని ఈ సర్వే వెల్లడించింది.
ఆసియాలో అతి తక్కువ వేతనాల పెరుగుదల జపాన్ (2%), తైవాన్ (3.9%) లో నమోదు కానుందని ఈ అధ్యనం పేర్కొంది. ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో ఈ విషయాలను వెల్లడించింది.

1.ప్రపంచవ్యాప్తంగా 4.9 శాతం.

కార్న్ ఫెర్రీ అడ్వైసోరీ ఇండియా నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల వేతనాల పెరుగుల రేటు తక్కువగానే ఉంది. 2020 లో ఇది కేవలం 4.9% గా ఉంటుందని సంస్థ అంచనా వేస్తోంది. భారత దేశంలో పెరిగే వేతనాల పెరుగుల రేటు 9.2% తో పోల్చితే ఇది కేవలం సగం మాత్రమే కావటం గమనార్హం. అయితే, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం రేటు 2.8% గా అంచనా వేసింది. దీని ప్రకారం చూస్తే నిజమైన వేతనాల పెరుగుదల కేవలం 2.1 శాతం మాత్రమే. అదే భారత్ లో మాత్రం ద్రవ్యోల్బణం తర్వాత కూడా వేతనాల పెరుగుదల 5.1% మేరకు ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా నిజ వేతనాలు తగ్గిపోతుండగా.భారత్ లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి తోడు ప్రభుతం తీసుకొంటున్నఅనేక సంస్కరణలు అన్ని రంగాల్లోనూ జాగ్రత్త పూరిత ఆశాభావాన్నినింపుతున్నాయి. అందుకే ఇక్కడ వేతనాలు, ఇంక్రెమెంట్లు పెరుగుతాయి అని కార్న్ ఫెర్రీ అడ్వైసోరీ ఇండియా ఎండీ రాజీవ్ కృష్ణన్ వ్యాఖ్యానించారు.

2.అమెరికా లో తక్కువే

అవకాశాల స్వర్గధామం ఐన అమెరికా లోనూ వేతనాల పెరుగుదల ఆశించిన మేరకు లేదు. 2020 లో అక్కడ కేవలం 2.8% మేరకు శాలరీలు పెరగనున్నాయి. ఆ దేశంలో ద్రవ్యోల్బణం కూడా పరిగణన లోకి తీసుకుంటే.నిజ వేతన పెరుగుదల 1.1% మాత్రమే. అంటే గతేడాది తో పోల్చితే అమెరికాలో వేతనాల పెరుగుదలలో వృద్ధి రేటు లేదని చెప్పాలి. తూర్పు యూరోప్ దేశాల్లో శాలరీలు పెరుగుల కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం తర్వాత నిజ పెరుగుదల తక్కువగా ఉంటోంది. అక్కడ మొత్తం పెరుగుదల 6.2% కాగా.. ద్రవ్యోల్బణం తర్వాత మాత్రం కేవలం 2.6% గా ఉంటోంది. పశ్చిమ యూరోప్ లో ఈ పెరుగుదల వరుసగా 2.5% , 1.2% గా ఉంటోంది.

3.అన్నీ అనుకూలిస్తే

ప్రభుత్వం తీసుకొంటున్న సంస్కరణ ఫలితాలు అందుటులోకి వస్తే.2020 నిజంగా ఉద్యోగులకు సంతోషాలను అందించే అవకాశం ఉంది. ఇంకా వ్యక్తిగత ఆదయ పరిమితులను సవరించే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఒక వేళ అది కూడా జరిగితే వేతన జీవులు ఊరట చెందే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు ధరల పెరుగుదల ... మరో వైపు ఉద్యోగాల కోత. ఎటు చూసినా ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రస్తుత అధ్యయనం కొంత ఆశాభావాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ సంస్థ అంచనా వేసినట్లు కచ్చితంగా ఇంత మొత్తం పెంచాలన్న నియమం ఎక్కడా లేకపోయినా.చాలా కంపెనీలు ఆ మేరకు వేతనాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించటం విశేషం. సాధారణంగా ఒక రంగంలోని అతి పెద్ద కంపెనీ ఏది చేస్తే మిగతా కంపెనీలు దానిని ఫాలో అవటం సహజమే. ఐటీ సహా అన్ని రంగాల్లోని పెద్ద కంపెనీలు సగటున 10% వేతనాల పెంపు నిర్ణయం తీసుకొంటే.అది మొత్తం దేశ వ్యాప్తంగా అదే స్థాయిలో శాలరీల పెరుగుదలకు దోహదం చేస్తుందనటంలో సందేహం లేదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :