Saturday, December 14, 2019

vivekananda reddi murder shocking twists



Read also:

వైఎస్ వివేకా హత్య కేసులో షాకింగ్ ట్వీస్ట్

సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపివేశారు. దీనికి సంబంధించి జగన్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి సిట్ అధికారులతో విచారణ చేస్తున్నా ఇంత వరకు ఒక కొలిక్కి రాలేదు. ఈ కేసులో ఒక నిందితుడిగా భావించిన శ్రీనివాసరెడ్డి గతంలో ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో కేసు మరింత పీఠముడిగా మారింది. ఈ కేసుకు సంబంధించి గత పది రోజులుగా సిట్ అధికారులు మరింత దూకుడుగా వ్యవహరిస్తూ బిటెక్ రవితో పాటు, ఆది నారాయణ రెడ్డి, వైఎస్ జగన్ కుటుంబసభ్యులను కూడా విచారించారు. ఈ విచారణలో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డి అతడి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించి మరొకసారి హాజరు కావలసి ఉంటుందని తెలియచేసారు.ఇలా సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంటే టీడీపీ నాయకుడు బీటెక్ రవి ఇప్పుడు ఈ కేసు విచారణకు సంబంధించి హైకోర్టు లో పిటిషన్ వేశారు. ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు, అమాయకులకు ఈ కేసులో శిక్ష పడకూడదని, ఈకేసుతో ఎలాంటి సంబంధం లేని తమను విచారిస్తున్నారని ఈ హత్య వెనుక తమ ప్రమేయం ఉంటే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని కానీ తమను విచారణ పేరుతో వేధిస్తున్నారని, వైఎస్ వివేకా అజాతశత్రువని అతనితో తమకు ఎలాంటి విబేధాలు లేవని, సీబీఐతో విచారణ చేపట్టాలని కోరిన వైఎస్ వివేకా కూతురు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. బిటెక్ రవి వేసిన కేసును హైకోర్టు స్వీకరిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ స్వీకరించి సీబీఐ విచారణకు ఆదేశిస్తే కేసులో పెద్ద ట్వీస్ట్ అని చెప్పుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :