Monday, December 9, 2019

vindam nerchukundam radio lesson



Read also:

Vindam Nerchukundam Today lesson

vindam-nerchukundam-radio-lessons
vindam-nerchukundam-radio-lessons
తేది : 09.12.2019
విషయము :   తెలుగు
పాఠం పేరు : "ఎవరు బాధ్యులు?"
తరగతి : 4వ తరగతి
సమయం : 11-00 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
✡ బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
• పాఠ్యాంశ సారాంశాన్ని సంభాషణలు ద్వారా గ్రహిస్తారు.
• సామాజిక ఆస్థులను ఎలాకాపాడుకోవాలో అర్థం చేసుకుంటారు.
• ప్రకృతిలోని ఇతర ప్రాణులను ఎలా చూడాలో అర్థం చేసుకుంటారు.
• వివిధ కృత్యాలు ద్వారా వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు.
• వివిధ అంశాలను విని,చదివి అర్థం చేసుకొని, ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు,రాస్తారు.
• ఇచ్చిన ఆధారాలు ఆధారంగా సృజనాత్మకతను సాధిస్తారు.
• ఆట ద్వారా పదజాలాభివృద్ధిని సాధిస్తారు.
• పాట ద్వారా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. పాటను సొంతంగా పాడగలుగుతారు.
✡ బోధనాభ్యసన సామాగ్రి :
1. తెలుగు పాఠ్యపుస్తకం    2. నోటుపుస్తకం    3. పెన్నులు     4. నల్ల బల్ల    5. సుద్దముక్కలు   6. చార్టు పై రాసి ఉంచిన పాట.
✡ కృత్యాలు
ఆట :
(అ) రేడియో పాఠం ప్రసార సమయంలో నిర్వహించే ఆటను గురించి తెలుసుకోవాలి.ఆటను పిల్లలతో చక్కగా ఆడించాలి.
కృత్యం 1:
• ఈ ఆటలో పిల్లలు రేడియో టీచర్ సూచనలు ఆధారంగా నటించాలి.
• రేడియో టీచర్ సూచన చెప్పగానే మ్యూజిక్ వస్తుంది - అప్పుడు అలాగే నటించాలి.
ఉదా: వర్షంలో గొడుగు పట్టుకొని నడుస్తున్నట్లుగా, సైకిలు తొక్కుతున్నట్లుగా.
కృత్యం 2:
• రేడియోలో మ్యూజిక్ రాగానే పిల్లలు వృత్తం చుట్టూ తిరగమనాలి.
• మ్యూజిక్ ఆగగానే ఈ పిల్లలంతా వృత్తం చుట్టూ తిరగడం ఆపాలి.
• రేడియో టీచర్ సూచన ప్రకారం నల్లబల్ల పై రాసిన వాక్యాలను చదివి, వాటి పర్యవసానంను పిల్లలతో చెప్పించాలి. • ఇలా ఆట మొత్తం ఆడించాలి.
 (ఆ) కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై అవగాహన కలిగియుండాలి.
కృత్యం 1 : (వినడం - మాట్లాడం)
• పాఠ్యాంశ సంభాషణల పై ఐదు ప్రశ్నలు అడుగబడును.
• ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క విద్యార్థితో సమాధానం చెప్పించాలి.
• రాజు, లతలు చెప్పే సమాధానాలను వినేలా చూడాలి.
కృత్యం -2 : (చదవడం - అవగాహన చేసుకొని వ్యక్తీకరించడం)
• పాఠ్యపుస్తకంలోని 93 వ పేజీలో గల చివరి సంభాషణ పేరాలోని మొదటి నాలుగు వరుసలు చదివించాలి.
• రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు విద్యార్థులతో సమాధానం చెప్పించాలి.
✡ పాఠ్యాంశ సంబంధిత పాట:
ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టు పై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.
పాట
 పల్లవి :
మేలుకోండి! మేలుకోండి! మానవులారా!
జగతి నేలుకోండి ! మేలుకోండి ! మానవులారా   //మేలుకోండి! //
చరణం 1:
ప్రాణాలు నిలబెట్టు మనతోడు చెట్లు !
నరకొద్దు, కూల్చొద్దు, రక్షించు చెట్లు!
చెట్లంటు లేకుంటే ! మన కెంతో కరువు!
చెట్లంటు లేకుంటే ! బతుకంత బరువు !   //మేలుకోండి! //
చరణం 2:
సెల్ టవర్ వెదజల్లే రేడియో తరంగాలు
మన పిచ్చుక నేస్తాలకు మహాప్రాణగండాలు
వెలుగు నిచ్చు కరెంటు స్తంభాలనన్నీ
జెండాలను చుట్టి పాడు చేయకండిదాన్ని   //మేలుకోండి! //
చరణం 3:
రోడ్డు గుంతలైతే! ప్రమాదాలు జరిగితే!
అది ఎవరి బాధ్య త! అది మన బాధ్య తే!
మన చుట్టూ వనరుల్నీ కాపాడాలీ!
మన మనుగడ కోసమెంతో కృషి చేయాలి   //మేలుకోండి! //
✡ పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :