Friday, December 27, 2019

Today AP Cabinet decisions list



Read also:

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. శుక్రవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం 01:15 గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ నివేదిక, స్థానిక ఎన్నికలపై ఈ సమావేశంలో నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశంలో భాగంగా రాజధానిపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మూడు రాజధానులపై కేబినెట్‌ భేటీలో.అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత నిర్ణయం ప్రకటించాలని అనుకున్నట్లు సమాచారo

Today AP Cabinet decisions list

రాజధాని అంశంపై చర్చించేందుకు ఏర్పాటైన ఏపీ కేబినెట్ సమావేశం 2గంటల 15 నిమిషాలపాటూ సాగింది. ఇందులో ప్రధానంగా రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టును సీఎం జగన్, మంత్రులు చర్చించారు. అమరావతిలో పరిస్థితులు, విశాఖలో పరిపాలనా పరంగా రాజధాని ఏర్పాటు ప్రతిపాదన, రాజధానిలో రైతులకు ఎలా న్యాయం చెయ్యాలి? ఇలాంటి అంశాలన్నింటిపైనా చర్చించారని తెలిసింది. ఐతే.కేబినెట్‌ సమావేశంలో ప్రస్తుతానికి రాజధాని అంశంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చే పూర్తిస్థాయి నివేదిక కీలకం కానుంది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రాజధాని అంశంపై ప్రస్తుతానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానిపైనా ఇవాళ్టి కేబినెట్ మీటింగ్‌లో చర్చ జరిగింది. ఆ సంస్థ జనవరి 3న పూర్తి స్థాయి నివేదిక ఇస్తుందని తెలిసింది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాతే.రాజధానిపై ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోగా రాజధాని అంశంపై కేబినెట్ సబ్ కమిటీని వెయ్యాలని కేబినెట్ చర్చించినట్లు తెలిసింది.

బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (BCG) అనేది.రాజధాని అనేది గ్రీన్ ఫీల్డ్ ఏరియాల్లోనే కాక.బ్రౌన్ ఫీల్డ్ ఏరియాల్లో కూడా ఉండొచ్చని చెబుతోంది. బ్రౌన్ ఫీల్డ్ అంటే... ఆల్రెడీ భవనాలు ఉన్న చోటిని ఇలా పిలుస్తారు. BCG పూర్తి స్థాయి నివేదికను బట్టీ.రాజధాని ఎక్కడ ఉండాలన్నది నిర్ణయిస్తారని తెలిసింది. ఒకవేళ BCG ఇచ్చే నివేదిక ఆధారంగా రాజధానిని నిర్మించాలనుకుంటే.అమరావతి లాగా ఏమాత్రం నిర్మాణాలు లేని ప్రదేశం కంటే.ఆల్రెడీ నిర్మాణాలు ఉన్న వైజాగ్ లాంటి ప్రాంతంలోనే రాజధానిని నిర్మించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు BCG నివేదిక కీలకం కానుంది.

ప్రస్తుతం అమరావతి రైతులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. వారికి న్యాయం చేసే అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలన్న అంశం కీలకంగా మారింది. అందువల్లే వెంటనే ఈ అంశంపై ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయిందని తెలిసింది. BCG నివేదిక వచ్చేటప్పటికి మరో వారం టైమ్ ఉంటుంది కాబట్టి.ఈ లోగా ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించే ఛాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 3 తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కూడా ఉంటుందని తెలిసింది.

ప్రస్తుతం శీతాకాలమైనా ఏపీలో మాత్రం హాట్‌ హాట్‌గా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి రైతులు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ.. రాష్ట్ర మంత్రి వర్గ భేటీ ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటలకు పైగా కేబినెట్‌ చర్చించింది. సచివాలయంలో ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఎంతో ఉత్కంఠ నడుమ సాగిన కేబినేట్ సమావేశం ముగిసింది. అనంతరం భేటీలో డిస్కర్షన్‌కి వచ్చిన అంశాలపై మీడియాతో మాట్లాడారు మంత్రి పేర్ని నాని. పలు ముఖ్యమైన అంశాలపై కేబినెట్‌లో చర్చించినట్టు.. వాటిని తప్పక అమలు పరుస్తామని మంత్రి పేర్ని నాని తెలియజేశారు.

కేబినెట్ కీలక నిర్ణయాలు:

1) అమరావతిలో భూదందాపై న్యాయ నిపుణులతో చర్చ
2) ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం
3) ముఖ్యంగా సీఆర్‌డీఏలో జరుగుతోన్న అక్రమాలపై చర్యలు
4) పంచాయితీరాజ్ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
5) పంచాయితీరాజ్ ఎలక్షన్స్‌కు రిజర్వేషన్లు ఖరారు
6) ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
7) 108 ఆంబెలెన్స్ సర్వీసుల్లో ఎన్నో సమస్యల పునరుద్ధరణ
8) 412 కొత్త 108 వాహనాలు, 656 కొత్త 104 వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం
9) 341 శాశ్వత పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం
10)ప్రతీ ఏడాది పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాల పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం
11) మచిలీపట్నం పోర్టును ప్రభుత్వమే నిర్మించేందుకు ఎస్‌పీవీ ఏర్పాటు.

చర్చకొచ్చిన అంశాలివీ

కాగా.వీటితో పాటు రాజధాని రైతులకు ఇచ్చే రిటర్నబుల్‌ ప్లాట్స్‌ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో అమరావతిలో ఆలిండియా సర్వీస్‌ అధికారులు భూములు కొనుగోలుకు చెల్లించిన మొత్తాన్ని తిరిగివారికి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుందని సమాచారం. కర్నూలులో వెటర్నరీ కాలేజీ ఏర్పాటుపై కూడా కేబినెట్‌లో చర్చించారని తెలుస్తోంది.

సీఎంకు నివేదిక అందజేత

గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎం వైఎస్ జగన్‌కు అందజేసింది. దాదాపు 4 నెలల పాటు వేర్వేరు సందర్భాల్లో సమావేశమై రాజధాని సహా అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసింది. రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలు, ల్యాండ్ పూలింగ్, రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు పైనా ఈ కమిటీ అధ్యయనం చేసింది. కేబినెట్ సమావేశంలో ఉప సంఘం నివేదిక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై జూన్ 30 న కెబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలపై హైపవర్‌ కమిటీ

అమరావతి: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం వివరాలను సమాచారా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర  ప్రభుత్వమే నిర్మిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా 108 వాహనాలు కొనుగోలుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 412 వాహనాల కొనుగోలుకు రూ.78కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధానిపై గత ప్రభుత్వం చేసిన తప్పులను మంత్రివర్గ ఉప సంఘం గుర్తించిందని నాని తెలిపారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయాలు ఉంటాయన్నారు. ఈ వ్యవహారాన్ని లోకాయుక్త, సీబీఐ, సీబీసీఐడీలో దేనికి అప్పగించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజధానిపై జీఎన్‌ రావు కమిటీ  ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చించామని తెలిపారు. రాజధాని పట్టణీకరణపై బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) నివేదిక ఇంకా అందాల్సి ఉందని.. ఆ రెండు నివేదికలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు.
శివరామకృష్ణ కమిటీని కాదని అప్పటి మంత్రి నారాయణ కమిటీని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రాజధానికి భూ సమీకరణ చేశారు. ప్రాథమికంగా 32 వేల ఎకరాలు, మరో 20వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాలని అప్పట్లో నిర్ణయించారు. వాస్తవాలను మరచి గత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంకల్పించింది. రూ.లక్షా 9వేల కోట్ల పెట్టుబడులు అవసరమని భావించి కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. అనుభవజ్ఞులైన గత సీఎం రూ.లక్ష కోట్లు అప్పు తెస్తామని కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే తేగలిగారు. రూ.లక్ష కోట్లు తేవాలంటే ఎంతకాలం పడుతుందో ప్రజలు అంచనా వేసుకోవాలి.మేమే తేగలిగినంత తెచ్చాం ఇంకెవరు అప్పు ఇస్తారని గత ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు మరో రూ.లక్ష కోట్లు అవసరం ఉంది. ఆస్పత్రుల అభివృద్ధికి రూ.14వేల కోట్లు, పాఠశాలల అభివృద్ధికి రూ.12వేల కోట్లు, అమ్మ ఒడి పథకానికి రూ.6వేల కోట్లు.ఇలా చాలా నిధులు అవసరమవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి, ప్రజల అవసరాలు, భవిష్యత్తు చూడాలా?కలల రాజధాని ఎప్పటికి నిర్మాణం చేయగలం? ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధిని పక్కన పెట్టి రాజధాని నిర్మాణం చేసే పరిస్థితి వస్తే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైతో ఎప్పటికి పోటీ పడగలం అనే దానిపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. జనవరి మొదటి వారంలో బీసీజీ నివేదిక అందే అవకాశముంది. జీఎన్‌ రావు, బీసీజీ నివేదికపై అధ్యయం చేసేందుకు హైపవర్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీలో మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఉంటారు. హైపవర్‌ కమిటీ సూచనల బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాజధానులపై సీఎం జగన్‌ ప్రకటన చేయలేదు. పరిపాలనా వికేంద్రీకరణ గురించి చెబుతూ ఎక్కడ ఏది ఉండొచ్చు అని మాత్రమే చెప్పారు’ అని మంత్రి పేర్ని నాని వివరించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :