Monday, December 9, 2019

There is no waiver of scholarships



Read also:

దిల్లీ: ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలను మాఫీ చేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల గణాంకాల ప్రకారం.. 2016-17 నుంచి 2019 మార్చి వరకు ఎడ్యుకేషన్‌ లోన్‌లు రూ. 67,685.59 కోట్ల నుంచి రూ. 75,450.68కోట్లకు పెరిగాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అంతేగాక, విద్యా రుణాలు చెల్లించలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా జరగలేదని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్‌ లోన్‌ల రికవరీల్లో బ్యాంకులు ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడట్లేదని, ఆ రుణాల పట్ల చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :