More ...
More ...

Saturday, December 14, 2019

steps to get the lost pan card



Read also:

పాన్ కార్డు పోయిందా -డోంట్ వర్రీ ఇదిగో ఇలా ఫాలో అయిపోండి.

పాన్ కార్డు.పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) గురించి మరోసారి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీలకమైన ఫైనాన్షియల్ సంబంధించి డాక్యుమెంట్ ఇది. ఆదాయపు పన్ను శాఖ ఈ కార్డును జారీ చేస్తుంది. ఆధార్ కార్డు ఎంత అవసరమో ఇది కూడా అంతే. అయితే బ్యాంక్ అకౌంట్, పెద్ద మొత్తంలో మనీ డిపాజిట్ (రూ.50,000కు పైన) వంటి చాలా వాటికి పాన్ కార్డు అవసరం. పన్ను చెల్లింపుదారులు అందరికీ ఇన్‌ కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయాలంటే ఈ పాన్ కార్డు చాలా అవసరం.
కీలకమైన డాక్యుమెంట్లలో పాన్ కార్డు కూడా ఒకటి. ఒకవేళ పాన్ కార్డు పోతే? అప్పుడు వెంటనే డూప్లికేట్ కార్డు కోసం అప్లై చేసుకోవలసిన అవసరం ఉంటుంది. డూప్లికేట్ పాన్ కార్డు లేదా పాన్ కార్డు రిప్రింట్ కోసం మీరు డూప్లికేట్ పాన్ కార్డు అప్లికేషన్ డౌన్‌ లోడ్ చేసుకోవలసి వస్తుంది. డూప్లికేట్ పాన్ కార్డు కోసం ఆన్‌లైన్‌ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌ఎస్‌డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీస్ సర్వీసెస్ అనే రెండు సంస్థలు పాన్ కార్డులను ఇష్యూ చేసే సంస్థలు. ఆదాయపు పన్ను శాఖ ఈ రెండింటికి మాత్రమే పాన్ కార్డు జారీ అధికారాన్ని ఇచ్చింది.
ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌ సైట్‌ కు వెళ్లాలి. www.tin-nsdl.com ద్వారా పోర్టల్‌కు వెళ్లొచ్చు. ఇప్పుడు రిప్రింట్ ఆఫ్ పాన్ కార్డు ఆప్షన్‌ పై క్లిక్ చేసి, మీకు ఈ ఆప్షన్ కనిపించకపోతే సర్వీసెస్‌ పై క్లిక్ చేసి పాన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. కిందకు వస్తే రిప్రింట్ ఆఫ్ పాన్ కార్డు ఆప్షన్ అని కనిపిస్తుంది. ఇప్పుడు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డు రిప్రింట్ కోసం ఆధార్ కార్డు వివరాలు ఎంచుకోవచ్చనే ఆప్షన్‌ పై క్లిక్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తరువాత సబ్‌ మిట్ చేయాలి. ఇప్పుడు మీకు సంబంధించిన మాస్క్‌డ్ వ్యక్తిగత వివరాలు అక్కడ కనిపిస్తాయి.
తర్వాత ఓటీపీ ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఈమెయిల్, మొబైల్ నెంబర్ లేదా రెండింటికీ అనే ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని ఎంపిక కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇన్‌ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న వివరాలతో పాన్ కార్డు ప్రింట్ ఆప్షన్ ఎంచుకోవాలి. జనరేట్ ఓటీపీ ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్‌ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ 10 నిమిషాల వ్యాలిడిటినీ మాత్రమే కలిగి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్‌ మిట్ చేయాలి.
ఓటీపీ ఓకే అయిన తర్వాత ఇప్పుడు పేమెంట్ చేయాలి. దీని కోసం పే కన్ఫార్మ్‌ పై క్లిక్ చేయాలి. అప్పుడు పేమెంట్ గేట్‌ వే పేజ్‌ కు వెళ్తారు. అప్పుడు రుసుమును గాను రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. డబ్బు చెల్లించిన తర్వాత స్క్రీన్‌ పై ట్రాన్సాక్షన్ వివరాలు ఇస్తారు. కంటిన్యూ‌పై క్లిక్ చేసి, పేమెంట్ రశీదును ప్రింట్ తీసుకోండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ కు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. దీని ద్వార ఇ - పాన్ డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :