More ...

Daily Health Tips

More ...

Teachers Useful

More ...

Mobile Offers

More ...

GO Proceedings

More ...

AmmaVodi

More ...

SA1-keys

More ...

Wednesday, December 25, 2019

Solar eclipse total information

Read also:

ఈనెల 26వ తేదీ అంటే డిసెంబర్ 26, 2019, గురువారం రోజున మూలా నక్షత్రంలో ధనుస్సు రాశిలో త్రిపాదాధిక కేతు గ్రస్త కంకణ ఆకార సూర్య గ్రహణం సంభవిస్తున్నది. గ్రహణ సమయాలు ఒకసారి పరిశీలిస్తే భారత కాలమానం ప్రకారం స్పర్శ కాలం ఉదయం 8 గంటల 9 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. మధ్యకాలం ఉదయం తొమ్మిది గంటల 31 నిమిషములకు, మోక్ష కాలం ఉదయం 11:11 నిమిషములకు అవుతుంది. మొత్తం పుణ్యకాలం సమయం మూడు గంటల రెండు నిమిషాలు. ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది.

ఇది ధనుస్సురాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణాన్ని జన్మరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ధనస్సు రాశి వారు, అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృషభ రాశి వారు, అర్ధాష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్య రాశి వారు చూడకపోవడం మంచిది. అంటే గ్రహణ సమయం లో ఉండే చెడు కిరణాలకు దూరంగా ఉండటం.

మిగతా రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదు. ఇక్కడ గ్రహణ ప్రభావం అంటే అనుకూల ఫలితాలు లేకుండా ఉండడం తప్ప ఏదో చెడు జరుగుతుంది మరేదో కీడు సంభవిస్తుందని భయపడాల్సిన అవసరం లేదు.

గ్రహణం సమయంలో నెగటివ్ రేస్ భూమి పైన ఉంటుంది రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి త్వరగా అనారోగ్యం వస్తుంది, అలాగే ఆ సమయంలో తిన్న ఆహారం జీర్ణించుకునే శక్తి శరీరానికి ఉండదు...స్పేస్ నుండి నిత్యం కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది గ్రహణం సమయం లో అది రాదు, బాక్టీరియా ఎక్కువ ఉంటుంది నెగటివ్ రేస్ గుడిలో యంత్రాన్ని తాకకూడదు అని గుడి మూసేస్తారు...అలాగే ఆ టైం లో మంత్రం జపం చేసే వాళ్లకు ఆ నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఉండదు, గ్రహణం వదిలాక గుడిలో కి ఎంత తలుపులు మూసిన నెగటివ్ పవర్ ఉంటుంది అందుకే ప్రతి అంగుళం సుద్ది చేస్తారు, మన శరీరాలు కూడ ఆ నెగటివ్ బాక్టీరియా ఎఫిర్ట్ కాకుండా స్నానం చేయాలి.

దర్బ కు నెగటివ్ పవర్ ని దూరం చేసే గుణం ఉంది. దర్బ వేయడం వల్ల ఆహారంలో కి వచ్చే నెగటివ్ బాక్టీరియా ని అది ఆకర్షిస్తుంది. తర్వాత అది తీసి పడేయాలి

గ్రహణ సమయంలో వివిధ రూపాల్లో దేవతా రూపాలు ఉండదు దైవ శక్తి దుష్ట శక్తి అన్ని శక్తులు అమ్మవారి ఆధీనంలో ఉంటుంది అప్పుడు ఆమె రూపం దుర్గ సృష్టిని రక్షించే రూపం, ఆమెకు ఏ గ్రహ నియమాలు ఉండదు అయితే గుడిలో యంత్రం ఉంటుంది కనుక ఆ యంత్ర శక్తిని నెగటివ్ పవర్ ఆకర్షించ కుండా అమ్మవారి గుడి కూడా ముస్తారు .. ఉపదేశం ఉన్నా లేకున్నా గ్రహణ సమయంలో దుర్గా నామ జపం ఎంతో శక్తిని అనుగ్రహాన్ని ఇస్తుంది..ఆ సమయంలో లోకాలను రక్షించ డానికి ఆమె విశ్వప్రాణ శక్తిని రక్షిస్తూ ఉంటుంది ఆ సమయంలో చేసే మంత్ర జపం ఎక్కడ జరుగుతూ ఉన్నా అదంతా కూడా ఆ తల్లి స్వయంగా స్వీకరిస్తుంది కనుక అధిక మైన ఫలితం ఉంటుంది, గ్రహణ సమయంలో గాయత్రి జపించరు, అలాగే ఏ మంత్ర జపం అయినా ఆమె కే చెందుతుంది, ఆమె దృష్టి వారి పైన పడుతుంది.

గర్భవతులకు పిండం ఎదుగుతున్న సమయం కనుక వారి శరీరానికి నెగటివ్ పవర్ ని తట్టుకునే శక్తి ఉండదు.. రోగ నిరోధక శక్తి గర్బములో ఉన్న బిడ్డ కోల్పోతారు అందుకే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తుంది అని వారిని బయటకు వెళ్ళనీయరు.

గ్రహణం సమయంలో చేసే జపం కానీ దానం కానీ అనేక రేట్లు ఫలితం ఉంటుంది.. గ్రహణ సమయంలో దానం తీసుకునే వారికి కూడా శుభమే కలుగుతుంది.

గ్రహణం పెట్టె సమయానికి విడిచిన తర్వాత పట్టు విడుపు స్నానం చేయాలి, మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు జపం చేయడం అధిక ఫలితం ఉంటుంది, అలాగె మంత్రోపదేశం లేని వారు కూడా కుల దేవత నామ స్మరణ చేయడం మంచిది. అనారోగ్యంతో ఉన్న వారు తినకుండా ఉండలేరు కనుక గ్రహణం పట్టక ముందే తినడం మంచిది, ఆరోగ్యం గా ఉన్న వారు గ్రహనంకి  6 గ ముందు నుండి ఆహారం తీసుకోకూడదు  . గ్రహణం విడిచాక తల స్నానం చేసాకే ఇల్లు, దేవుళ్ళు శుభ్రం చేసి దీపం పెట్టుకోవాలి.

గ్రహణం అంటే మనదేశంలో చాలా జాగ్రత్తలు తీసుకునే అలవాటు ఉంది. ప్రపంచంలో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందకముందే పలు విశ్వరహస్యాలను మనవారు ఛేదించారు. వాటిలో ఖగోళ విషయాలు అనేకం ఉన్నాయి. ఏ సమయంలో ఏ గ్రహం ఎలా ఉంటుంది, గ్రహణాలు ఎప్పుడు, తిథులు, వాతావరణ విశేషాలు ఇలా అనేకం ఉన్నాయి. అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయి. అయితే ఆయా సందర్భాలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు కూడా చెప్పారు. గ్రహణం సమయంలో ఏం చేయకూడదు, ఏం చేయాలో పెద్దలు చెప్పిన విషయాలు తెలుసుకుందాం

ఈ ఏడాది ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. ఈ ఏడాదిలో చివరి గ్రహణం డిసెంబరు 26న ఏర్పడుతోంది. ఈసారి ఏర్పడే కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత సంభవించనుంది.
మరోవైపు సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజులకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంటే 2020 జనవరి 10న ఆ ఏడాదికి చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఏం చేయకూడదు

ఎవరైన గ్రహణాన్ని గ్రహణ సమయంలో ప్రత్యక్షంగా చూడ కూడదు. ఫిల్మిలతో గ్రహణం చూడకూడదు. రెగ్యులర్‌గా వాడే సన్‌ గ్లాసెస్‌తో గ్రహణాన్ని చూడరాదు. ఇంట్లో ఇతర వస్తువులతో కూడా ప్రతక్ష్యంగా గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణాన్ని చూసే కంటి అద్దాలతో, సోలార్‌ ఫిల్టర్స్‌తో మాత్రమే గ్రహణాన్ని చ ూడాలి. గర్భిణీలపై గ్రహణం ప్రభావం చూపుతుందని బలంగా నమ్ముతారు. ఇది మూఢనమ్మకమా, శాస్త్రీయ కోణమా అనేది పక్కనబెడితే గర్బిణిలు కొన్ని సూచనలు పాటించాలి. గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే భోజనం ముగించాలి. గ్రహణం మొదలైన తర్వాత ఆహారం తీసుకోరాదట. రాహు, కేతువుల చంద్రుడ్ని మింగినప్పుడు వాటి లాలాజలం భూమిపై పడుతుందని, ఇవి విషపూరితమైనవి పెద్దలు అంటారు. కాబట్టి ఆ సమయంలో ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయని నమ్మకం.

గర్భంలోని పిండంపై త్వరితగతిన ప్రభావం చూపుతుందని, తద్వారా పుట్టబోయే సంతానం ఏదైనా లోపాలతో పుడతారని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ ప్రభావం పడకుండా గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా భోజనం చేయమని శాస్త్రం చెబుతుంది. అంటే తినే పదార్థానికి అరగడానికి సరైన సమయం అన్న మాట. సైన్స్‌ పరంగా చూస్తే గ్రహణం సమయంలో విడుదలయ్యే అతినీల లోహిత కిరణాల వల్ల ఆహారపదార్థాలపై ఉన్న క్రిమికీటకాలు మరింత పెరిగి, బ్యాక్టీరియా అధికమవుతుంది. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గ్రహణాన్ని చూడరాదని, చూడటం వల్ల పుట్టే పిల్లలు అనారోగ్యంతో ఉంటారని చెబుతారు. అయితే వెంటనే ప్రమాదం జరుగకున్నా భవిష్యత్‌లో ఏదైనా జరుగవచ్చు. ప్రయాణాలు కూడా తప్పనిసరి అయితేనే చేయాలి. వృద్ధులు, రోగగ్రస్తులు ఏదైనా లిక్విడ్‌ ఆహారాన్ని గ్రహణం ప్రారంభం కంటే ముందే తీసుకోవాలి. ఆహారాన్ని గ్రహణం పూర్తయిన తర్వాత స్వీకరిస్తే మంచిదని పెద్దలు చెప్తారు. అయితే డాక్టర్‌ సూచనల మేరకు వారు ఆహారాన్ని స్వీకరించాలి.

ఏం చేయాలి 

గ్రహణం సమయంలో గర్భవతులు ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు . గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ధ్యానం, జపం, ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిది . మార్గశిర అమావాస్య నాటి అబ్ధిక కార్యక్రామాన్ని యధావిధిగా అపరాన్నకాలంలో జరుపుకోవచ్చును . గ్రహణ పట్టు , విడుపు మధ్యస్నానాలాచరించే వారు, వారికున్న మంత్రనుష్టానములతో ఆచరించి యధావిధిగా స్నానాదులు ఆచరించి నిర్విహించవచ్చును . గ్రహణం గురించి ఎవరూ ఎలాంటి భయం కాని అందోళన కాని చెందవద్దు . గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రంగా కడుక్కొని , స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,ఒక 'టి' స్పూన్ పచ్చి ఆవుపాలు, రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని , పూజ మందిరంలో ఉన్న దేవత విగ్రహాలకు పులికాపి/శుభ్రం చేసుకోవాలి.

షష్ట గ్రహ కూటమిలో సూర్యగ్రహణ వల్ల ఏం జరుగబోతుందో తెలుసా 

శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలను ప్రోక్షణ చేసిన తరవాత దీపారాధన అలంకరణం చేసి నైవేద్య నివేదన కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి తమకున్న సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి , ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు, ఎక్కడ చేయకూడదు. ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి . ఇంట్లో పూజ పూర్తీ అయిన తర్వాత గుడికి దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును.మొదట ఇంట్లో పూజ చేయనిది దేవాలయాలకు ఎప్పుడూ వెళ్ళకూడదు. ఆ రోజు శక్తి కొలది ఆవునకు ఉలవలు ,బెల్లం , అరటి పండ్లు విస్తరి ఆకులో కాని అరటి ఆకులో కాని పెట్టి ఆవుకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేస్తే మంచిది.

గ్రహణం తర్వాత దానాదులను చేయడం వల్ల చెడు ఫలితాలను తగ్గించుకోవచ్చు. గ్రహణ వల్ల చెడుప్రభావం ఉండి దానాలు చేయలేని వారు భయపడాల్సిన పనిలేదు. వారు తమ శక్తి మేరకు భగవంతుడిని ప్రార్ధన, ఆరాధన, ధ్యానం చేసుకుని శాంతితో సహనంతో కాలం గడిపితే మంచిది. చెడు సమయం అంటూ నిజానికి ఏది ఉండదు. చెడు ఫలితాల వల్ల జీవితానికి కావల్సిన
అనుభవం, అన్నింటిని తట్టుకునే శక్తి వస్తుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు గ్రహణ స్నానం, పట్టువిడుపు స్నానాలను చేయడం, ధాన్యం, జపం, దానం, దేవాలయ సందర్శనం, ప్రదక్షణలు, దీపారాధన మంచి ఫలితాన్నిస్తాయి.


Teachers Single click softwares Download AP SSC New model papers Download SA-1 1-10th Exam Model papers Download All Subjects 1-10th Class Text-Books The Best Google Apps
Janardhan Randhi

About Janardhan Randhi

I’m the Founder of quickdevops.com I am a Professional Blogger, Application developer,YouTuber. I’ve been blogging since 2015.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials for my website and blog about advancements in web design and development.Besides programming I love spending time with friends and family and can often be found together going out catching the latest movie,planning a trip to someplace I've never been before.

Subscribe to this Blog via Email :