Read also:
SBI Home Loan ప్రస్తుతం ఉన్న 8.15 శాతం వడ్డీపై ఏకంగా పావు శాతం వడ్డీ తగ్గించి కస్టమర్లకు శుభవార్త చెప్పింది SBI . పావు శాతం వడ్డీ అంటే దీర్ఘకాలంలో కస్టమర్లకు చాలావరకు EMI తగ్గుతుంది .
హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికోసం. రుణం తీసుకొని ఇల్లు లేదా ప్లాట్ కొనాలనుకునే వారికోసం.SBI లో హోమ్ లోన్‌కు అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వడ్డీ రేటును భారీగా తగ్గించింది. ఇండస్ట్రీలో చూస్తే ప్రస్తుతం హోమ్ లోన్‌పై తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది ఎస్‌బీఐ మాత్రమే. ప్రస్తుతం ఎస్‌బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.15 శాతం నుంచి ప్రారంభమౌతాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఈ వడ్డీ రేట్లను మరింత తగ్గించింది. ఏకంగా 8.15 శాతం నుంచి 7.90 శాతానికి వడ్డీ రేటును తగ్గించింది. డిసెంబర్ 31 లోగా హోమ్ లోన్ తీసుకుంటే మీకు 2020 జనవరి 1 నుంచి 7.90 వడ్డీ రేటు మాత్రమే వర్తిస్తుంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'గృహప్రవేశ్ మంత్' పేరుతో హోమ్ లోన్ ఆఫర్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న 8.15 శాతం వడ్డీపై ఏకంగా పావు శాతం వడ్డీ తగ్గించి కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఎస్‌బీఐ. పావు శాతం వడ్డీ అంటే దీర్ఘకాలంలో కస్టమర్లకు చాలావరకు ఈఎంఐ తగ్గుతుంది. అయితే 2019 డిసెంబర్ 31 లోపు హోమ్ లోన్ తీసుకునేవారికే ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఒకవేళ మీరు యోనో ఎస్‌బీఐ నుంచి హోమ్ లోన్‌కు అప్లై చేస్తే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వెంటనే లభిస్తుంది. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ పొందిన తర్వాత మీరు ప్రాపర్టీ సెలెక్ట్ చేసి హోమ్ లోన్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. ఇక ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువగానే ఉన్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది.