Tuesday, December 31, 2019

SBI lending rate cut effective Jan. 1



Read also:

ఎస్‌బీఐ రుణ రేట్ల తగ్గింపురేపటి నుంచి అమల్లోకి. ఎక్స్‌టెర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత రేటు (ఈబీఆర్‌)ను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తగ్గించింది. వార్షికంగా 8.05 శాతంగా ఉన్న రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 7.80 శాతం చేసింది. కొత్త రేట్లు జనవరి 1 (బుధవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ రేటు కోతతో.. ఈబీఆర్‌ అనుసంధానమైన గృహ రుణ ఖాతాదారులతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) రుణ గ్రహీతలకు 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ తగ్గుతుందని బ్యాంక్‌ తెలిపింది. కొత్తగా గృహ రుణాలు తీసుకునేవారు 7.90 శాతం వార్షిక వడ్డీ రేటుకు రుణాలు పొందొచ్చు. ఈ ఏడాది జులై 1 నుంచి ఎస్‌బీఐ చలన రేటు ఆధారిత గృహ రుణాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అక్టోబరు 1 నుంచి గృహ, రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ రుణాలకు ఎక్స్‌టెర్నల్‌ బెంచ్‌మార్క్‌గా ఎస్‌బీఐ రెపో రేటును అమలు చేసింది.ఇండియన్‌ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ మార్పు: జనవరి 3 నుంచి నిధులపై వ్యయానికి అనుగుణంగా రుణాలపై వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను సవరించనున్నట్లు ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది.

SBI Housing Loan interest new rates below 

1. ఒక రోజు రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 7.95 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గించింది.
2. నెల వ్యవధి రుణాలపై రుణ రేటును 8 శాతం నుంచి 8.05 శాతానికి పెంచింది.
3. ఆరు నెలల వ్యవధిపై రుణ రేటును 8.20 శాతం,
4. ఏడాది కాలవ్యవధి గల రుణాలపై 8.30 శాతంగా రేట్లను నిర్ణయించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :