Monday, December 30, 2019

SBI debit card useful information



Read also:

మీ ఏటీఎం లిమిట్ ఎంత? రోజూ మీరు ఏటీఎం నుంచి ఎంత విత్‌డ్రా చేయొచ్చు? సాధారణంగా ఈ లిమిట్ బ్యాంకులు నిర్ణయిస్తాయి. అయితే మీ ఏటీఎం లిమిట్‌ను మీరే సెట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. ఎలాగో తెలుసుకోండి.

1. మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? మీరు రెగ్యులర్‌గా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుంటారా? రోజూ ఎంత విత్‌డ్రా చేయాలో మీరే లిమిట్ పెట్టుకోవచ్చు.
2. డైలీ లిమిట్‌ను మార్చుకునే స్వేచ్ఛను ఖాతాదారులకు అందిస్తోంది ఎస్‌బీఐ. మీ ఏటీఎం కార్డుల్ని మరింత సురక్షితంగా మార్చేందుకు బ్యాంకు అందిస్తున్న సరికొత్త సేవ ఇది.
3. విత్‌డ్రా లిమిట్ మార్చుకోవడం మాత్రమే కాదు. మీ ఏటీఎం కార్డును ఆన్‌, ఆఫ్ చేయొచ్చు. మీరు రెండు నెలల పాటు ఏటీఎం కార్డు వాడొద్దనుకుంటే ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇక మీ ఏటీఎం కార్డును ఎవరూ వాడలేరు.
4. ఒకవేళ మీ కార్డు ఎవరైనా కొట్టేసినా, మీరు పోగొట్టుకున్నా వెంటనే ఆఫ్ చేయొచ్చు. మరి ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి. 
5. ముందుగా మీరు https://www.onlinesbi.com/ వెబ్‌‌సైట్‌లోకి లాగిన్ కావాలి. e-services ట్యాబ్‌లో ''ATM Card Services'' ఎంచుకోండి.
6. అందులో ATM Card Limit/Channel/Usage/Change option పైన క్లిక్ చేయండి. మీకు ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లు ఉంటే సెట్టింగ్స్ మార్చాలనుకున్న అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి.
7. అకౌంట్‌కు లింక్ అయి ఉన్న ఏటీఎం కార్డులన్నీ స్క్రీన్‌ పైన కనిపిస్తాయి. ఏటీఎం కార్డు సెలెక్ట్ చేసి డ్రాప్‌ డౌన్ మెనూ క్లిక్ చేయాలి.
8. అందులో ''Change Daily Limit'' ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు ప్రస్తుతం ఉన్న లిమిట్ ఎంతో కనిపిస్తుంది. మీరు అంతకన్నా తక్కువ లిమిట్ సెట్ చేసుకోవచ్చు.
9. ఉదాహరణకు మీ లిమిట్ రూ.40,000 ఉంటే మీరు రూ.20,000 సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే హై సెక్యూరిటీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి
10. ఏటీఎం మాత్రమే కాదు. షాపింగ్‌ సమయంలో స్వైప్ చేసే లిమిట్ కూడా మీరే నిర్ణయించొచ్చు. ''Change Daily Limit'' ఆప్షన్ ఎంచుకున్న తర్వాత POS/CNP ఆప్షన్ క్లిక్ చేసి లిమిట్ మార్చుకోవాలి. 
11. దీంతో పాటు మీరు Channel కూడా మార్చుకోవచ్చు. ఒక్క ఏటీఎంలో మాత్రమే వాడాలనుకుంటే మిగతావి డిసేబుల్ చేస్తే చాలు. ఇంటర్నేషనల్ యూసేజ్ కూడా బ్లాక్ చేయొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :