Monday, December 30, 2019

SBI credit card cashback offer



Read also:

దేశీ దిగ్గజ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్ల కోసం బంప‌ర్‌ ఆఫర్ ప్రకటించింది. బ్యాంక్ ఎస్‌బీఐ కార్డు ద్వారా క్రెడిట్ కార్డు సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌తో కలిసి తన కస్టమర్లకు సరికొత్త ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్ ప్రీమియర్ క్రెడిట్ కార్డును అందిస్తోంది. ఈ క్రెడిట్ కార్డు అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. క్రెడిట్ కార్డుదారులు కార్డు తీసుకున్న తొలి 60 రోజుల్లో కార్డు ద్వారా రూ.2,000 ఖర్చు చేస్తే అప్పుడు రూ.500 విలువైన బుక్‌మైషో వోచర్ కూడా పొందొచ్చు.

అలాగే తొలి సంవత్సరం వార్షిక ఫీజు చెల్లిస్తే కస్టమర్లకు రూ.1,500 లేదా 1,500 బోనస్ పాయింట్లు లభిస్తాయి. ఈ బోనస్ పాయింట్లు ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ ప్లాటినం కార్డు అకౌంట్‌లో జమవుతాయి. ఇక ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌స్తే.. రైల్వే టికెట్లపై జీరో పేమెంట్ గేట్‌వే చార్జీలు ఉంటాయి. అంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రైల్వే టికెట్ బుక్ చేసుకుంటే పేమెంట్ గేట్‌వే చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే రూ.10 లక్షల వరకు కాంప్లిమెంటరీ రైల్వే ఇన్సూరెన్స్‌ను ఉచితంగా పొందొచ్చు. రూ.50 లక్షల ఎయిర్ ఇన్సూరెన్స్, రూ.లక్ష వరకు ఫ్రాడ్ లయబిలిటీ వంటి బెనిఫిట్స్ కూడా పొంద‌వ‌చ్చు.

ఈ క్రెడిట్ కార్డు ద్వారా ట్రైన్‌లో ఏసీ టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అదే ఫ్లైట్ టికెట్ బుకింగ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. మ‌రియు యాన్వల్ ట్రావెల్ స్పెండ్స్ రూ.50,000 దాటితే రూ.2,500 బోనస్ రివార్డ్ పాయింట్లు, రూ.లక్ష దాటితే రూ.5,000 బోనస్ పాయింట్లు, రూ.2 లక్షల స్పెండ్స్‌పై వార్షిక ఫీజు వెనక్కి వంటి ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :