Friday, December 20, 2019

SBI atm card info



Read also:

మీ వద్ద ఎస్‌బీఐ కార్డు ఉందా ఇది లేకపోతే ఇక అంతే

ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు వాడే వారిని ఆ సంస్థ మరోసారి అప్రమత్తం చేసింది. 2020 జనవరి 1 నుంచి మీ వద్ద ఉన్న పాత డెబిడ్ కార్డులు పనిచేయవని తేల్చి చెప్పింది. గతంలో కార్డులు పొందిన వారిలో చిప్ ఆధారిత ఈఎంవీ కార్డు లేకపోతే వచ్చే ఏడాది నుంచి అవి పనిచేయబోవని స్పష్టం చేశారు. ఒకవేళ పాత కార్డులు ఉన్నవారు వెంటనే వెళ్లి తమ బ్యాంకుల్లో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గైడ్ లైన్స్‌ ప్రకారం భద్రత కోసం చిప్ ఆధారిత కార్డులను మనుగడలోకి తీసుకువచ్చారు. పాత వాటి స్థానంలో ఇప్పటికే కొంత మందికి ఈ కార్డులు అందజేశారు. ఇంకా ఎవరైనా పాతకార్డునే వాడుతుంటే మాత్రం వెంటనే వాటిని మార్చుకోవాలని సూచించారు.ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉన్నవాళ్లు మాత్రం నేరుగా ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశం కల్పించారు. వెంటనే మీ వద్ద ఉన్న కార్డులను ఓసారి చెక్ చేసుకొని ఒకవేళ చిప్ లేని కార్డులు ఉంటే వెంటనే మార్చేసుకోండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :