Saturday, December 28, 2019

QR code on 10th class marks memos



Read also:

  • పదవ తరగతి నకిలీ మెమోలను అరికట్టేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది.
  • ఇందులో భాగంగా పది మెమోలపై ఇకపై క్యూఆర్‌ కోడ్‌ పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది.
  • దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమవుతోంది.
  • 2004 నుంచి పదో తరగతి మెమోలను ఆన్‌లైన్‌లో పొందుపరిచిన ప్రభుత్వ పరీక్షల విభాగం అంతకుముందుకు మెమోలనూ ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు కసరత్తు చేస్తోంది.
  • ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన వారు అందజేసిన మెమోలు నకిలీవా? అసలైనవా? అని గుర్తించేందుకు ఈ విధానాన్ని తీసుకువస్తోంది.
  • ఇకపై విద్యార్థులకు ఇచ్చే మెమోలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించే ఆలోచనకు వచ్చింది.
  • తద్వారా నకిలీ మెమోలను అరికట్టవచ్చని భావిస్తోంది.
  • అసలైన మెమోపై ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేస్తే సదరు అభ్యర్థి సమగ్ర వివరాలు తెలుస్తాయని, అదే నకిలీ మెమోపై క్యూఆర్‌ కోడ్‌ ఉండదని, ఒకవేళ ఏదైనా ముద్రించినా ఆ వివరాలు రావని, తద్వారా మెమోలు నకిలీవి తయారు చేయకుండా నిరోధించవచ్చని అధికారులు చెబుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :