Monday, December 23, 2019

ppf new rules



Read also:

పబ్లిక్ ప్రొవిడియంట్ ఫండ్స్ లేదా PPF అకౌంట్లు కలిగిన లబ్ధిదారులకు ఇటీవలే ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. అత్యంత ప్రాముఖ్యం పొందిన చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో PPF ఒకటి. ఈ పథకంలో గ్యారెంటెడ్ రిటర్న్ పొందవచ్చు. ఈ పీపీఎఫ్ అకౌంట్లకు 15 ఏళ్ల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం వడ్డీ రేట్లను ప్రకటిస్తుంటుంది.
ప్రస్తుత త్రైమాసికానికి PPF వడ్డీ రేటును ఏడాదికి 7.9శాతంగా పొందవచ్చు. తక్కువ బ్యాలెన్స్ క్రెడిట్ అయ్యే అకౌంట్లపై క్యాలెండర్ నెలలో ఐదో రోజు ముగింపునకు నెలాఖరు మధ్యలో ఈ వడ్డీరేట్లను లెక్కించడం జరుగుతుంది. ప్రతి ఏడాది ఆఖరిలో పీపీఎఫ్ అకౌంట్లలో వడ్డీ క్రెడిట్ అవుతుంది.

కొత్త PPF రూల్స్ 5 పాయింట్లతో వివరణ

1) కొత్త PPF డిపాజిట్ నిబంధనల ప్రకారం.. ఒక ఖాతాదారుడు ఆర్థిక సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా రూ. 50లకి మల్టీపుల్ డిపాజిట్లు చేయవచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ. 1.5 లక్షలు కలిపి డిపాజిట్ చేయవచ్చు. అంతకుముందు, ఒక ఏడాది వ్యవధిలో గరిష్టంగా 12 డిపాజిట్లకు అనుమతి ఉంటుంది.
2) అకౌంట్ తెరిచిన ఐదేళ్ల తర్వాత మాత్రమే నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే PPF అకౌంట్‌ను ముందస్తుగా మూసివేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ప్రీమెచ్యూర్ క్లోజర్ అనుమతి ఉంటుంది.
(i) ఖాతాదారుడు, అతని జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల ప్రాణాంతక వ్యాధి చికిత్సకు, సహాయ పత్రాలు, చికిత్స చేసే వ్యాధిని నిర్ధారించే వైద్య అధికారుల నుంచి మెడికల్ రిపోర్టులు
(ii) ఖాతదారుడి ఉన్నత విద్య లేదా భారతదేశంలో లేదా విదేశాలలో గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థలో ఆధారపడిన పిల్లల ప్రవేశాన్ని ధృవీకరించే పత్రాలు, ఫీజు బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది.
ఇప్పుడు, PPF ఖాతాను ముందస్తుగా మూసివేయడానికి ప్రభుత్వం మరో ప్రమాణాన్ని జోడించింది: ఖాతాదారుడి రెసిడెన్సీ స్థితిలో మార్పు చేయాలనుకుంటే.. పాస్‌పోర్ట్, వీసా లేదా ఆదాయపు పన్ను రిటర్న్ కాపీలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ.. PPF అకౌంట్లను ముందస్తుగా మూసివేస్తే.. ఖాతాదారుడి అకౌంట్‌కు వడ్డీ.. డిపాజిట్ చేసిన రేటు కంటే 1శాతం తక్కువ వడ్డీని పొందుతారు.
3) ఖాతాదారుడు PPF ఖాతాల నుండి రుణాలు తీసుకోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం.. ఖాతాదారుడు తన ఖాతా నుండి రుణం తీసుకునే రేట్లు అంతకుముందు ఉన్న 2 శాతం నుంచి ప్రస్తుత PPF వడ్డీ రేటు కంటే 1 శాతానికి తగ్గించడం జరిగింది.
ఖాతాదారుడి మరణిస్తే.. ఖాతాదారుడు పొందిన రుణంపై వడ్డీని చెల్లించడానికి నామినీ లేదా చట్టపరమైన వారసుడు బాధ్యత వహిస్తాడు. కానీ అతని మరణానికి ముందే తిరిగి చెల్లించడం జరగదు. ఖాతా చివరి మూసివేత సమయంలో అలాంటి వడ్డీ మొత్తం సర్దుబాటు అవుతుంది.
4) అదనంగా, పోస్ట్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన డిసెంబర్ 2 నాటి నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ చెక్కును మీ PPF అకౌంట్లోకి, మొత్తం పరిమితికి లోబడి, ఏదైనా నాన్ హోం పోస్టాఫీసు శాఖలో జమ చేయడానికి అనుమతించింది. మునుపటి పరిమితి రూ. 25వేలు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్, PPF సుకన్య సమృద్ది ఖాతాలకు ఇదే రూల్ వర్తిస్తుంది.
5) ఏదైనా CBS పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన AII POSB చెక్కులు.. ఏదైనా CBS పోస్ట్ ఆఫీస్ వద్ద సమర్పించినట్లయితే par cheques మాదిరిగానే పరిగణించాలి. క్లియరింగ్ కోసం పంపకూడదు. POSB చెక్కును ఇతర SOLs లేదా సర్వీస్ అవుట్ లెట్లలో అంగీకరించవచ్చు. (అమౌంట్ పరిమితి లేకుండా క్రెడిట్ మొత్తం) POSB / RD / PPF / SSA ఖాతాలలో క్రెడిట్ కోసం, పరిమితులకు లోబడి, ఏదైనా ఉంటే, ఈ పథకంలో సూచించడం ఉంటుంది' అని నోటిఫికేషన్ పేర్కొంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :