Monday, December 30, 2019

PM Modi Pension scheme



Read also:

పదవీ విరమణ చేసిన తర్వాత రెగ్యులర్ ఆదాయం పొందాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకే అనుగుణంగా అందుబాటులో ఉన్న ఆప్షన్‌ను ఎంచుకుంటారు. వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా పెన్షన్ పొందడానికి చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లో సీనియర్ సిటిజన్స్ మాత్రమే చేరగలరు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. ఈ స్కీమ్ 2017 జూలై నుంచే అందుబాటులో ఉంది. 2020 మార్చి చివరి దాకా ఈ పథకం ఉంటుంది. ఈలోపు స్కీమ్‌లో చేరితనే పథకం ప్రయోజనాలు పొందగలరు. లేదంటే లేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ Finance Ministry ఇటీవలనే వయ వందన స్కీమ్‌కు ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేసింది

అంటే ఈ స్కీమ్‌లో చేరే వారు ఆధార్ నెంబర్ కచ్చితంగా సమర్పించాలి. ఒక వ్యక్తి ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రధాన్ మంత్రి వయ వందన స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలకు కనీసం రూ.1,000 నుంచి పెన్షన్ తీసుకోవచ్చు. అంటే ఏడాదికి కనీసం రూ.12,000 పెన్షన్ వస్తుంది.

అలాగే ఈ స్కీమ్ ద్వారా నెలకు గరిష్టంగా రూ.10,000 వరకు కూడా పెన్షన్ తీసుకోవచ్చు. మీరు తీసుకునే పెన్షన్ మొత్తం ఇన్వెస్ట్ చేసే డబ్బు ప్రాతిపదికన మారుతుంది. ఈ స్కీమ్‌లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.10,000 పెన్షన్ తీసుకోవచ్చు. పెన్షన్ మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున తీసుకోవచ్చు.

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ NEFT ద్వారా లేదా Aadhaar ఆధారిత పేమెంట్ సిస్టమ్ ద్వారా పెన్షన్ డబ్బులు పొందొచ్చు. మీరు ఎప్పుడు పెన్షన్ పొందాలని భావిస్తున్నారో అది మీ ఇష్టం. స్కీమ్‌లో చేరేటప్పుడు ఈ విషయాన్ని తెలియజేయాలి. స్కీమ్‌లో చేరిన తర్వాత మీకు నచ్చకపోతే పథకం నుంచి బయటకు రావొచ్చు. అయితే స్కీమ్‌లో చేరిన 15 రోజుల్లోగానే ఈ పని పూర్తి చేయాలి. లేదంటే కుదరదు. ఇకపోతే ఈ స్కీమ్‌లో చేరితే లోన్ సదుపాయం కూడా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులో 75 శాతం వరకు లోన్ సదుపాయం పొందొచ్చు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :