Saturday, December 7, 2019

Petrol rate will be increase



Read also:

పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

చమురు ధరలు మళ్లీ భగ్గుమనబోతున్నాయి. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ఒపెక్ దేశాలు రోజుకు 5 లక్షల బ్యారెల్ల క్రూడాయిల్ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వచ్చే నెల 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వియన్నాలో రష్యాతోపాటు ఒపెక్ దేశాల కూటమి సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. దీంతో రోజువారి ఉత్పత్తి 17 లక్షల బ్యారెల్లకు పడిపోనున్నది. అక్టోబర్ 2018 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. సమృద్దిగా చమురు నిల్వలు ఉండటం, ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం గుప్పిట్లో ఉన్న నేపథ్యంలో ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో ధరలపై ఒత్తిడి పెరుగనున్నది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :