Sunday, December 8, 2019

Pension scheme



Read also:

ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. సామాన్య ప్రజల కోసం సంక్షేమ పథకాలతో పాటుగా.. సోషల్ స్కీమ్స్ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ.. పెన్షన్ వచ్చేందుకు సరికొత్త స్కీంను ప్రవేశపెట్టింది. అదే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకం. ఈ పెన్షన్‌ స్కీం వివరాలు ఎంటీ.ఎలా చేరాలో చూద్ధాం.

అటల్ పెన్షన్ యోజన పథకం.

ఇది ఓ పెన్షన్ స్కీం. ఇది అసంఘటిత రంగంలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని దీనిని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ స్కీమ్‌ అందరికీ వర్తించదు. ఎవరైతే.. ఏ విధంగా కూడా.. సామాజిక భద్రతా పథకంలో సభ్యులుగా లేని వారే దీనికి అర్హుల్.
అయితే వీరి వయస్సు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. వారే ఈ ఈ పథకంలో చేరవచ్చు. స్కీంలో చేరాక.. వీరికి 60 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత.. ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ.5000 వరకూ పెన్షన్‌ పొందుతారు. అయితే ఎంత మొత్తంలో పెన్షన్ అందుకోవాలన్న దానినిబట్టి.. ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈ ప్రీమియం కూడా చాలా తక్కువే ఉంటుంది. అయితే వయసును బట్టి.. ప్రీమియం ధరల్లో మార్పులు ఉంటాయి. 18 ఏళ్ల వయస్సులోనే ఈ పథకంలో చేరితే.. నెలకు రూ.1000 పెన్షన్ పొందాలంటే. వారు నెలకు రూ.42 కడితే సరిపోతుంది. ఇక అదే రూ.5000 వరకు పొందాలంటే.. నెలకు రూ.210 ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.

ఈ పెన్షన్ స్కీమ్‌లో ఎలా చేరాలంటే.

ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరాలంటే మీకు సేవింగ్ బ్యాంక్ ఖాతా ఉంటే చాలు. మీకు జన్ ధన్ అకౌంట్ ఉన్నా కూడా దాని నుంచి ఈ స్కీంలో చేరవచ్చు. ఇందుకోసం మీరు నేరుగా బ్యాంకు మిత్రను కలవడం.. లేదా.. బ్యాంక్‌కు వెళ్లి ఈ స్కీం గురించి అడిగి చేరవచ్చు. దీనికోసం మరే ఇతర కొత్త అకౌంట్ తీసుకోవాల్సిన పనిలేదు. అంతేకాదు.. ప్రతి నెల ప్రీమియం చెల్లింపుకు ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే.. బ్యాంకు ఖాతా నుంచి అటో డెబిట్ సౌకర్యం ఉంటుంది. సో మీరు అకౌంట్‌లో సరిపడ డబ్బులు ఉంటే.. ప్రీమియం అమౌంట్ అటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. ఇది అటల్ పెన్షన్ స్కీం వివరాలు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :