Tuesday, December 24, 2019

Payment of Income Tax



Read also:

ఇటీవల కొంత మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్నుశాఖ నుంచి ధ్రువీకరణ పత్రాలు వస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఒక కార్యక్రమం కింద ఈ పత్రాలను అందజేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులను గుర్తించేందుకు ప్రభుత్వం చేస్తున్న చిరుప్రయత్నం ఇది. చెల్లించే పన్ను మొత్తం ఆధారంగా వీటిని జారీ చేయడంలేదు.. మొత్తం ఐదు రకాలు ఆదాయం పొందే వారికి ఇస్తున్నారు. జీతం, మూలధన లాభాలు, వ్యాపారం, అద్దె, ఇతర మార్గాల ద్వారా ఆదాయం వచ్చేవారిని దీని కింద పరిగణలోకి తీసుకొన్నారు. మీరు సరైన సమయంలో పన్ను చెల్లించినా మీకు ధ్రువీకరణలు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సరైన సమయంలో పన్ను చెల్లించకపోవడం, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేకపోవడం, ఐటీఆర్‌ ప్రాసెస్‌ను సరైన సమయంలో చేయకపోవడం వంటివి ఉన్నారు.

ఎటువంటి బకాయిలు లేకుండా పూర్తిగా పన్ను చెల్లించినవారికి అందజేస్తున్నారు. ఐటీఆర్‌ను కంప్యూటర్‌ మార్గాల్లో ఫైల్‌ చేసినవారికి 120 రోజులలోగా వెరిఫై చేసిన వారికి ఇది అందుతుంది. ఈ ధ్రువీకరణ డిజిటల్‌ సిగ్నేచర్‌ మోడల్‌లో అందుతుంది. మీ ఈమెయిల్‌, మొబైల్‌ నెంబర్‌ను ఈఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో అప్‌గ్రేడ్‌ చేయాలి. ఇక చెల్లించే ఆదాయాన్ని బట్టి నాలుగు కేటగిరీల్లో వీరిని వర్గీకరించారు.
ప్లాటినం : రూ.కోటి కంటే ఎక్కువ చెల్లించే వారిని ఈ కేటగిరిలోకి తీసుకొంటారు.
గోల్డ్‌ : రూ. 50 లక్షల నుంచి రూ.కోటి మధ్యలో పన్ను చెల్లించేవారిని దీనిలోకి తీసుకొంటారు.
సిల్వర్‌ : దీనిలో రూ.10లక్షల నుంచి రూ.50లక్షల మధ్య వారుఉంటారు.
బ్రాంజ్ : దీనిలో రూ.1లక్ష నుంచి రూ. 10లక్షల వరకు ఉన్న వారు ఉంటారు.
మీరు వీటిల్లో ఏదో ఒక కేటగిరిలో ఉండి.. కచ్చితంగా పన్నులు చెల్లిస్తుండాలి. దీంతోపాటు వెరిఫికేషన్‌ కూడా కచ్చితంగా జరిగి ఉంటే మీకు ధ్రువీకరణ వస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :