Saturday, December 14, 2019

Nokia smart phone for lowest price



Read also:

తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. నోకియా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. 'ఆండ్రాయిడ్ గో' ఎడిషన్‌లో నోకియా సీ1 మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది హెచ్ఎండీ గ్లోబల్. చాలా తక్కువ ధరలో ఈ ఫోన్‌ను తయారు చేసింది నోకియా. ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు కానీ... ఒకవేళ ఇండియాకు ఈ ఫోన్ వస్తే రూ.4,000 ధరలో ఉంటుందని ఓ అంచనా. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 2,500ఎంఏహెచ్ బడ్జెట్‌తో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ బేసిక్ యూజర్లకు మంచి ఆప్షన్ కానుంది. మైక్రో యూఎస్‌బీ సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్ బటన్, ఎఫ్ఎం రేడియో లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ 3జీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వైఫై కూడా వాడుకోవచ్చు.త్వరలో ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఏసియన్ పసిఫిక్ దేశాల మార్కెట్‌లోకి రానుంది ఈ ఫోన్.
నోకియా సీ1 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల డిస్‌ప్లేర్యామ్: 1జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ
ప్రాసెసర్: క్వాడ్ కోర్
రియర్ కెమెరా: 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 2,500ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై (గో ఎడిషన్)
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, రెడ్
ధర: సుమారు రూ.4,000

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :