Monday, December 30, 2019

Nokia 2.3 mobile specifications



Read also:

ఇండియాలో బడ్జెట్ సెగ్మెంట్‌లో హెచ్ఎండీ గ్లోబల్ బాగా ప్రచారం చేస్తున్న నోకియా 2.3 సేల్ డిసెంబర్ 27న ప్రారంభం కానుంది. ఒకేసారి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.
1. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను కొద్దిరోజుల క్రితమే పరిచయం చేసింది హెచ్ఎండీ గ్లోబల్. నోకియా 2.3 డిసెంబర్ 27 నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. 'బడే కామ్ కా ఫోన్' అంటూ నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రమోట్ చేస్తోంది నోకియా.
2. నోకియా 2.3 మోడల్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న నోకియా 2.2 అప్‌గ్రేడెడ్ వర్షన్. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా పరిచయం చేసింది నోకియా. బ్యాటరీ రెండు రోజులు వస్తుందని చెబుతోంది. ధర రూ.8,199 మాత్రమే.
3. నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌లో 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. కావడంతో బడ్జెట్ సెగ్మెంట్‌లో షావోమీ, రియల్‌మీ, సాంసంగ్, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.
4. నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను 2020 మార్చి 31 లోపు కొని 2020 ఏప్రిల్ 7 లోగా యాక్టివేట్ చేసినవారికి రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ ఆఫర్ ప్రకటించింది కంపెనీ. రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ ఆఫర్ పొందాలంటే ఒరిజినల్ ఇన్‌వాయిస్ భద్రపర్చుకోవాలి.
5. ఇక నోకియా 2.3 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.2 అంగుళాల హెచ్‌డీ+ నాచ్ డిస్‌ప్లే ఉండటం విశేషం.
6. నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్ 2 జీబీ+32 జీబీ వేరియంట్‌తో రిలీజైంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
7. నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా13+2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్.
8. నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
9. నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ సిమ్‌తో పాటు మెమొరీ కార్డుకు స్లాట్ కూడా ఉంది. చార్‌కోల్, సియాన్ గ్రీన్, సాండ్ కలర్స్‌లో లభిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :