Read also:
2022 నాటికి నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి వివరాలు
దిల్లీ: మరో రెండేళ్లలో అంటే 2022 నాటికి నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి రానుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొనే సమయానికి కొత్త భవనంలో సమావేశాలు జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం లోక్‌సభ శీతాకాల సమావేశాలు పూర్తయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నూతన భవన నిర్మాణం ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమ్మతి తెలిపినట్లు చెప్పారు. ప్రతిపాదిత భవనం కోసం ప్రభుత్వం రెండు, మూడు ప్రాంతాలు పరిశీలిస్తోందని వెల్లడించారు.
ఎంపీలు కూర్చునే ప్రదేశానికి ఇంటర్నెట్ సౌకర్యం ఇవ్వడం సహా పలు సాంకేతిక హంగులతో ఈ భవనం రూపొందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
అంతేగాక.కొత్త పార్లమెంట్‌ను కాగితరహితంగా మారుస్తామని, డిజిటైజేషన్ కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 1858 వరకు బ్రిటిష్ పాలనలో జరిగిన చర్చలతో సహా చర్చలు, సమావేశాలను డిజిటల్ రూపంలోకి మార్చినట్లు ఓం బిర్లా తెలిపారు. పార్లమెంట్ క్యాంటీన్లో ఎంపీలకిచ్చే రాయితీ.వచ్చే సమావేశాల నాటికి ఎత్తివేసే అవకాశముందన్నారు.