Wednesday, December 4, 2019

Me bank in ap Jahan new plan



Read also:

ఏపీలో 'మీ బ్యాంక్'.. జగన్ సరికొత్త ప్లాన్ ఇదేనా

ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు, పెన్షన్లు, సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు.. ఇలా అన్నీ కలుపుకుంటే సుమారు రూ.2 వేల కోట్లను ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు చెల్లింపులు చేస్తోంది. ఇక ఈ డబ్బును చెల్లించడానికి ప్రభుత్వం తొలుత ట్రజరీకి నిధులు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత అది ప్రభుత్వ రంగ బ్యాంకులైన ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఉద్యోగుల ఖాతాల్లోకి జమ అవుతాయి.

ప్రస్తుతం ఈ విధానం కొనసాగుతుండగా.. వైసీపీ ప్రభుత్వం దీనికి స్వస్తి పలికి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఓ బ్యాంకును ఏర్పాటు చేయాలని యోచిస్తోందట. అదే 'మీ బ్యాంక్'. సహజంగా ఉద్యోగులు తమ అవసరాల మేరకు డబ్బును డ్రా చేస్తారు తప్పితే.వేతనం మొత్తాన్ని ఒకేసారి డ్రా చేసుకోరు. అయితే ఇతర బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించడం వల్ల.. అది ప్రభుత్వం పరిధిలోకి రాదు. ఒకవేళ ప్రభుత్వం తరపున బ్యాంకు ఉంటే.. ఉద్యోగులు తమ అవసరాలకు విత్ డ్రా చేసిన సొమ్ము కాకుండా.. మిగిలిన మొత్తం ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. ఇక ఈ బ్యాంక్ ఏర్పాటు వెనక ఉన్న అసలు ఆలోచన ఇదేనని తెలుస్తోంది. దీని వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ కాదు.. అదే విధంగా లబ్దిదారులకు చెల్లించాల్సిన సొమ్ము కూడా చెల్లించినట్లు ఉంటుంది.

'గ్రీన్ ఛానల్ పీడీ' ఖాతా తరహాలోనే 'మీ బ్యాంక్'ను కూడా ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కార్ ఆలోచిస్తోందట. వేతనాలు, సంక్షేమ పధకాలు, పెన్షన్లు.. ఇతరత్రా వంటివి ఈ బ్యాంక్ ద్వారానే లబ్దిదారులకు చెల్లించాలని భావిస్తున్నారని సమాచారం. అంతేకాక లబ్ధిదారులు ఒకేసారి మొత్తం సొమ్మును విత్ డ్రా చేసుకోకుండా పరిమితులు విధించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆధార్, బయోమెట్రిక్ అనుసంధానిత అకౌంట్లను లబ్దిదారులకు ఇవ్వాలని యోచనలో ఉన్నారు. కాగా, కేరళ ట్రెజరీ బ్యాంక్ తరహాలోనే త్వరలో ఏర్పాటు కానున్న'మీ బ్యాంక్' పని తీరు కూడా ఉంటుందని వినికిడి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :