Saturday, December 7, 2019

Lkg and nursary are banned in private schools



Read also:

ప్రైవేట్ స్కూళ్లలో ఎల్కేజీ , నర్సరీలు రద్దు . ప్రభుత్వ కీలక ఆదేశాలు 

ప్రభుత్వకీలక ఆదేశాలు ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు వీధికి ఒకటి ఉంటే . ప్రైవేట్ స్కూల్స్ మాత్రం మూడు నాలుగు కనిపిస్తున్నాయి . ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి . రెండున్నరేళ్లకు స్కూల్స్ లో జాయిన్ చేసుకోవడంతో చాలా మంది తల్లిదండ్రులు కూడా పైవేట్ స్కూల్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు . నర్సరీ , ఎల్కేజీ , యూకేజీలంటూ మూడేళ్లకే పిల్లలతో అక్షరాలు దిద్దించేస్తున్నారు . అయితే ఇక నుంచి ప్రైవేట్ స్కూల్స్ లో ఆ పప్పులేవి ఉడకవని హర్యాన ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది . ప్రవైట్ విద్యా సంస్థల్లో ఇకపై నర్సరీ , ఎల్కేజీ , యూకేజీలు నిర్వహించొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది . హాయిగా ఆడుకొనే పసివయసులోనే చిన్నారులు స్కూల్ బాట పట్టడం సరికాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు . అందుకే ఐదేళ్ల తర్వాత మాత్రమే పిల్లలను స్కూళ్లలో జాయిన్ చేయాలని ఆదేశించారు . పిల్లలు ఆడటానికి మరియు మానసికంగా ఎదగడానికి తగినంత సమయం కావాలి . దానిని దృష్టిలో ఉంచుకుని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నర్సరీ , ఎల్ కెజి , యూకేజీలు నిర్వహించొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది . హాయిగా ఆడుకొనే పసివయసులోనే చిన్నారులు స్కూల్ బాట పట్టడం సరికాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు . అందుకే ఐదేళ్ల తర్వాత మాత్రమే పిల్లలను స్కూళ్లలో జాయిన్ చేయాలని ఆదేశించారు . పిల్లలు ఆడటానికి మరియు మానసికంగా ఎదగడానికి తగినంత సమయం కావాలి . దానిని దృష్టిలో ఉంచుకుని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నర్సరీ , ఎల్ కెజి , యుకెజి తరగతులను మూసివేయాలని నిర్ణయించింది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :