Saturday, December 14, 2019

JIO cashback offer steps



Read also:

మీరు జియో సిమ్ వాడుతున్నారా? అయితే ఇది మీకు ఓక రకంగా శుభవార్త. ఎందుకంటే జియో రీచార్జ్ చేసుకోవడం ద్వారా మీరు రూ.149 క్యాష్ బ్యాక్ ను కచ్చితంగా లభిస్తుంది. యూపీఐ పేమెంట్లను ప్రోత్సహించేందుకు జియో ఈ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. మీరు ఈ క్యాష్ బ్యాక్ ను పొందాలంటే కొన్ని రూల్స్ అనుసరించాలి.
ఇక ఈ ఆఫర్ ను పొందాలంటే మీరు గూగుల్ పేను ఇన్ స్టాల్ చేసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే గూగుల్ పే యూపీఐ ఐడీ ద్వారా మాత్రమే చెల్లింపు జరిపితేనే ఈ ఆఫర్ పొందవచ్చును. కాబట్టి మీరు మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ పేను ఇన్ స్టాల్ చేసుకుని అందులో బ్యాంక్ అకౌంట్లను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ పే ద్వారా చెల్లింపు జరపడానికి  యూపీఐ సిద్ధం చేసుకోవాలి.
ఆ తర్వాత మీరు మీ స్మార్ట్ ఫోన్ లో మై జియో యాప్ ను ఓపెన్ చేసి, అక్కడ మీరు రీచార్జ్ చేసుకోవాలనుకుంటున్న ప్లాన్ ను ఎంచుకోవాలి. అయితే అనంతరం పేమెంట్ పేజీలో గూగుల్ పే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మీరు రూ.149 క్యాష్ బ్యాక్ ను పొందాలంటే కచ్చితంగా రూ.149 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న ప్లాన్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి.
అందులో గూగుల్ పే ఆప్షన్ ను ఎంచుకున్న అనంతరం మీ స్మార్ట్ ఫోన్ లో ఆటోమేటిక్ గా గూగుల్ పే యాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ చెల్లింపును పూర్తి చేస్తే వెంటనే రూ.149 క్యాష్ బ్యాక్ మీరు గూగుల్ పేలో డీఫాల్ట్ గా ఉంచిన బ్యాంకు ఖాతాలో జమ సరాసరి అయిపోతుంది. అయితే ఎవరికైనా కేవలం ఒక్కసారి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
అయితే ఈ ఆఫర్ ను పొందడానికి మీరు గూగుల్ పే కొత్త కస్టమర్ మాత్రమే అయి ఉండాలి. గూగుల్ పే ద్వారా మీరు జరిపే మొదటి లావాదేవీ ఈ జియో రీచార్జ్ అయితేనే మాత్రం మీకు ఈ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే ఎటువంటి రెఫరల్ ద్వారా గూగుల్ పేని ఇన్ స్టాల్ చేసి ఉండకూడదు. మీ గూగుల్ అకౌంట్, ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతాలు ఏవీ మరో గూగుల్ పే ఖాతాకు అటాచ్ అసలు ఉండకూడదు.
మీరు ఒక సంవత్సరంలో తొమ్మిది వేలకు పైగా లాభాలు పొంది ఉండకూడదు. అప్పుడు మాత్రమే మీకు ఈ క్యాష్ బ్యాక్ వస్తుంది. దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ మై జియో యాప్, జియో.కాం, గూగుల్ పేల ద్వారా మాత్రమే జరగాలి. అప్పుడు మాత్రమే దీనికి సంబంధించిన క్యాష్ బ్యాక్ మీకు లభిస్తుంది. ఈ నిబంధనలన్నిటికీ లోబడి మీరు ట్రాన్సాక్షన్ జరిపినప్పుడు మాత్రమే మీకు ఈ రూ.149 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్ని కండిషన్లతో ఎవరు క్యాష్ బ్యాక్ పొందుతారో చూడాలి మరి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :