Monday, December 23, 2019

Income tax returns information



Read also:

వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు
కానీ 2019 బడ్జెట్ ప్రకారం రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న పన్ను భారం ఉండదు.
ఇక్కడ రూ.2.5 లక్షల పరిమితి దాటితే ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందా
డబ్బు సంపాదించే వారు కచ్చితంగా చేయాల్సిన పని ఐటీఆర్ దాఖలు చేయడం. 2019 కేంద్ర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్ రిబేట్‌ను ప్రకటించింది. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. దీని అర్థం ఏంటి? రూ.5 లక్షలకు లోపు ఆదాయం ఉంటే.అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదనా? లేకపోతే పన్ను చెల్లింపు ఆదాయం లేకపోయినా కూడా ఐటీఆర్ దాఖలు చేయాల్సిందేనా?

కేంద్ర ప్రభుత్వం 2019 బడ్జెట్ ప్రకారం చూస్తే.. రిబేట్ ప్రకటించింది. అందువల్ల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నా కూడా రిబేట్ పొందాలంటే కచ్చితంగా ఐటీఆర్ (ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్) దాఖలు చేయాల్సిందే. అందువల్ల వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రాకున్నా కూడా ఇప్పుడు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఇండియామనీ.కామ్ సీఈవో, ఫౌండర్ సీఎస్ సుధీర్ మాట్లాడుతూ.. ‘‘మీ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే అప్పుడు మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఐటీఆర్ మాత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు. 60 ఏళ్లలోపు వారికి ఇది వర్తిస్తుంది. అదే 60 నుంచి 80 ఏళ్లలోపు వారి రూ.3 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండుదు. ఈ పరిమితి కన్నా ఎక్కువ సంపాదిస్తే అప్పుడు ఎలాగో పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించారు.

వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల సెక్షన్ 87ఏ కింద రిబేట్ పొందొచ్చు. ‘మీ వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉండి.. మీరు ఒకవేళ ఐటీఆర్ దాఖలు చేయకపోతే అప్పుడు ట్యాక్స్ నోటీసు వస్తుంది. బేసిక్ పన్ను మినహాయింపు (రూ.2.5 లక్షలు) పైన ఆదాయం కలిగి ఉంటే అప్పుడు కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాలి. స్థూల వార్షిక ఆదాయం ఎంతో తెలియజేయాలి’ అని వివరించారు.

హెచ్ఆర్ఏ, స్టాండర్డ్ డిడక్షన్, హోమ్ లోన్ వడ్డీ వంటిని స్థూల ఆదాయం నుంచి మినహాయింపు పొందినప్పుడు.ట్యాక్సబుల్ ఇన్‌కమ్ రూ.5 లక్షలు దాటకపోతే అప్పుడు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87ఏ కింద రిబేట్ పొందొచ్చని ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కార్తీక్ ఝవేరి తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :