Read also:
నిరంతరం మారుతోన్న టెక్నాలజీ వల్ల నూతన ప్రపంచం ఆవిష్కృతమవుతోంది. ఫలితంగా ఉద్యోగ సాధనలో చదువు కంటే నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఈ తరుణంలో 2020 దశాబ్దంలో జాబ్ రెడీగా ఉండాలంటే ఏయే స్కిల్స్ అవసరమనే అంశంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 15 దేశాల్లోని 350 కంపెనీల్లో అధ్యయనం చేసి ‘ది ఫ్యూచర్ జాబ్స్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. రాబోయే కాలంలో మొత్తం వృత్తి నిపుణుల్లో మూడొంతుల మంది ఈ నివేదికలో పేర్కొన్న స్కిల్స్ ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటారని ఆ నివేదిక పేర్కొంది.
తార్కిక ఆలోచన
ఒక విషయాన్ని తార్కికంగా, విమర్శనాత్మకంగా విశ్లేషించే సామర్థ్యం (క్రిటికల్ థింకింగ్) ఉన్న వారికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. రాబోయే కాలంలో వ్యాపార నిర్వహణ మరిన్ని సవాళ్లతో, సంక్లిష్టతలతో కూడుకున్న వ్యవహారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి క్రిటికల్ థింకింగ్‌ను తప్పనిసరి నైపుణ్యంగా కంపెనీలు పరిగణిస్తున్నాయి.
సృజనాత్మకత
నూతన, విభిన్న ఆలోచనలతో ఉండే వారిని నియమించుకోవడానికి కంపెనీలు సదా సిద్ధంగా ఉంటాయి. వీరిచ్చే సూచనలు, సలహాలు కంపెనీ పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకోవడానికి దోహదం చేస్తాయి. కాబట్టి రిక్రూట్మెంట్ ప్రాసె్‌సలో క్రియేటివిటీకి ప్రత్యేక స్థానం ఉంటూ వస్తోంది. కొత్త ప్రొడక్ట్స్, సర్వీసుల రూపకల్పనలో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలకు నూతన సాంకేతికతను అన్వయం చేస్తూ ముందుకుసాగే వారికి ఎక్కువగా డిమాండ్ ఉంటోంది.
కమ్యూనికేషన్
ఒత్తిడిని తట్టుకోవడంతోపాటు మెరుగైన కమ్యూనికేషన్ ద్వారా చేస్తున్న పనిలో గరిష్ట ఫలితాలను సాధించడం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ హై రేంజ్లో ఉన్న వారితోనే సాధ్యం. గతంలో జరిగిన కొన్ని అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేశాయి కూడా. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంప్లాయర్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
సమాంతర ఆలోచన
రాబోయే కాలంలో ఉద్యోగార్థుల నుంచి కంపెనీలు ఆశించే నైపుణ్యాల్లో అత్యంత కీలకమైంది కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ. రెండు వేర్వేరు భావనల గురించి ఆలోచిస్తూ దానికి సమాంతరంగా మల్టిపుల్ కాన్సెప్ట్స్ గురించి కూడా యోచన చేసే సామర్థ్యాన్ని కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీగా వ్యవహరిస్తారు. కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించే క్రమంలో ఆలోచనలు, విధానాలు, వ్యవస్థ, మెటీరియల్స్, డేటా వంటి వాటిని సమ్మిళితం చేయడంలో కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ కీలకంగా మారుతుంది.
క్లిష్ట సమస్యల విశ్లేషణ
క్లిష్టమైన సమస్యను గుర్తించి దానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి, పరిష్కార మార్గాలను కనుక్కోవడం, వాటిని అమలు చేసే సామర్థ్యాన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో వచ్చిన, రాబోయే సాంకేతిక ప్రగతికి కారణం ఈ నైపుణ్యమే. ఆటోమేషన్ కారణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ రంగాల్లో పరిమితంగా, ప్రొఫెషనల్ సర్వీస్, ఐసీటీ రంగాల్లో ఈ స్కిల్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
సమన్వయం, సర్దుబాటు
సహోద్యోగులతో సమన్వయంతో వ్యవహరిస్తూ వారి విధులకనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ ఫ్లెక్సిబుల్‌గా వ్యవహరించే గుణం ఉన్న వారికి ఎంప్లాయర్స్ ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్షణం వర్క్‌ప్లేస్ వ్యవహారాలను సాఫీగా నిర్వహించడానికి దోహద పడుతుంది.
అత్యుత్తమ పరిష్కారాలు
వేగంగా ఆలోచించడం, సత్వర నిర్ణయం తీసుకోవడం, జవాబుదారీగా ఉండటం, ఒక సమస్యకు అందుబాటులో ఉన్న వాటిల్లో అత్యుత్తమ పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడం వంటివి ఈ స్కిల్ పరిధిలోకి వస్తాయి. రాబోయే కాలంలో వర్క్ప్లే్సలో వచ్చే మార్పులకు అనుగుణంగా సత్వర నిర్ణయాలతో దూసుకెళ్లే ప్రొఫెషనల్స్ అవసరం ఎంతో.
పీపుల్ మేనేజ్మెంట్
మరో కీలక నైపుణ్యం పీపుల్ మేనేజ్మెంట్. ఇతరుల ను ఆకట్టుకోవడానికి కావల్సిన లక్షణాలు, చాతుర్యం, సామర్థ్యాలు వంటివి పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ కిందకు వస్తాయి. వీటిల్లో నిష్ణాతులు కావాలంటే చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ఆఫీస్ వ్యవహారాలు, క్లయింట్స్, సహోద్యోగులు తదితరులతో వివిధ అంశాలపై చర్చించేందుకు ఈ స్కిల్స్ కీలకం.
చర్చలు, రాజీలు కూడా
సంప్రదింపులు, చర్చలు, రాజీ కుదర్చడం ఇవన్నీ వినడానికి పాతకాలం మాటలుగా అనిపిస్తాయి. కానీ నేటి ఆధునిక యుగంలో కూడా వీటికి ఎనలేని ప్రాధాన్యం లభిస్తుంది. ప్రజలు, సంస్థల మధ్య ఏర్పడే విబేధాలను పరిష్కరించే క్రమంలో చర్చలు జరపటం, రాజీ కుదర్చడం వంటి నైపుణ్యాలు ఉన్న వారికి తగిన ప్రాధాన్యం లభిస్తుంది.
లాట్ కొత్త ఏడాది ఆఫర్లు
ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్ 2020 కొత్త ఏడాది ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో మొబైల్ ఎక్సేంజ్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్, అదనంగా రూ.5 వేల వరకు బోనస్, 30 శాతం వరకు పేటియం క్యాష్‌బ్యాక్, 10 శాతం వరకు హెచ్‌డిఎఫ్‌సి క్యాష్ బ్యాక్ పొందవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు వన్‌ప్లస్ 7టి మొబైల్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.3 వేల ఆదా, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో మొబైళ్లపై రూ.6 వేల రాయితీ అందిస్తోన్నట్లు తెలిపింది. ఒప్పో ఎ9 2020 మొబైల్‌పై రూ.1,500 వరకు డిస్కౌంట్, వివో వై17, 32 అంగుళాల ఎల్ఇడి టివి కాంబోను కేవలం రూ.14,990కే విక్రయిస్తోన్నట్లు తెలిపింది. అదే విధంగా రిటైల్ అవుట్లెట్లలో రెడ్మీ, టిసిఎల్ టివిలను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.