Monday, December 23, 2019

how to earn money from tik tok



Read also:

మీరు 'టిక్ టాక్' చేస్తున్నారా ? అయితే మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు

టిక్ టాక్ ఇప్పుడు దాదాపు అన్ని ఫోన్లలో ఉంటున్న ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఇది. ప్రజలే స్వయంగా ఇందులో పాల్గొని తమ వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఈ యాప్‌కి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చారు. దాంతో. దీని ద్వారా డబ్బు సంపాదించడం ఎలా అన్న కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడీ యాప్ వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి యాప్స్‌కి గట్టి పోటీ ఇస్తోంది. జస్ట్ 15 సెకండ్లలో పూర్తయ్యే వీడియోలని చూసేందుకు నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. అందువల్ల ఈ యాప్‌ వాడకం ఎక్కువైపోయింది. ఇండియాలో మరీ ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల టిక్ టాక్ ద్వారా డబ్బు సంపాదించడానికి ఇదే సరైన సమయం అంటున్నారు టెక్ నిపుణులు. ఇంకెందుకు లేట్ ఫటాఫట్ విషయం తెలుసుకుందాం.

టిక్ టాక్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? ఇలా :

Step 1:మీకు ప్రత్యేక టిక్ టాక్ ప్రొఫైల్ ఉండాలి. ప్రజలకు నచ్చే కంటెంట్ మీరు క్రియేట్ చెయ్యాలి. వీలైనంత ఎక్కువ మంది ఫాలోయర్లను సంపాదించుకోవడం మీ టార్గెట్ అవ్వాలి.
Step 2:ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ అయ్యే పాటలు, కాన్సెప్ట్‌లను ఎంచుకోవాలి. ఇందుకోసం పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను సర్ఫింగ్ చెయ్యాలి. అలాగే. ఆడియన్స్ మూడ్ తెలుసుకోవాలి.
Step 3: మీ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని టిక్ టాక్‌కి లింక్ చెయ్యాలి. తద్వారా మీ టిక్ టాక్ వీడియోలకు ఆడియెన్స్ పెరుగుతారు. మీ ప్రొఫైల్‌లో ఎడిట్ ప్రొఫైల్ ట్యాప్ చేసి. అందులో యాడ్ యూట్యూబ్ ఆప్షన్ ఎంచుకోండి. ఇన్‌స్టాగ్రాం కోసం. యాడ్ ఇన్‌స్టాగ్రామ్ ఆప్షన్ ఎంచుకోండి.
Step 4:మీ వీడియో ఎక్కువ మంది ఆడియెన్స్‌కి రీచ్ అయ్యేలా చెయ్యాలి. ఇందులో మీరు విజయం సాధిస్తే, సోషల్ మీడియాలో మీకు ఆర్గానిక్ సెర్చ్ పెరుగుతుంది.
Step 5:ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌కి ఎలాగైతే హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారో. టిక్ టాక్ వీడియోలకూ అలాగే ఇవ్వండి.
Step 6:మీ ప్రొఫైల్‌కి చెప్పుకోతగ్గ ఫాలోయర్లు (కనీసం 30 వేల మంది) వచ్చాక. మీ వీడియోలపై యాడ్స్ వచ్చేలా మీరు బ్రాండ్స్‌, స్పాన్సర్లను కలిసి మాట్లాడుకోవచ్చు. బ్రాండ్స్. హై రేటింగ్ ఉన్న వీడియోలకు యాడ్స్ ఇస్తాయి. తద్వారా మీకు కొంత డబ్బు చెల్లిస్తాయి. యూట్యూబ్ లాగా టిక్ టాక్ ఇప్పటివరకూ వీడియోలపై యాడ్స్ వేసి. క్రియేటర్లకు డబ్బులు ఇచ్చే విధానం తేలేదు.
Step 7:సెలెబ్రిటీలకు మీ వీడియో చేరేలా చేస్తే. ఎక్కువ మంది దాన్ని చూస్తారు. తద్వారా ఎక్కువ యాడ్ ప్రమోషన్ పొందొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :