Monday, December 30, 2019

How to delete the number from true caller



Read also:

ట్రూకాలర్ యాప్‌తో ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఏ మొబైల్ నంబర్ వివరాలైనా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా కొత్త నంబర్‌తో ఎవరికైనా కాల్ చేస్తే. వాళ్ల మొబైల్‌లో ట్రూకాలర్ యాప్ ఉంటే, అందులో మీ నంబర్, పేరు కూడా కనిపిస్తుంది. తద్వారా కాల్ చేసింది ఎవరో తెలుసుకోగలరు. ఇదెలా సాధ్యమంటే. ఈ యాప్‌లో అన్ని నంబర్ల వివరాలూ ఉంటాయి. అందువల్ల ఎవరు ఏ నంబర్‌తో కాల్ చేసినా. వాళ్ల పేరు, వివరాల్ని ఇట్టే చెప్పేస్తుంది ట్రూకాలర్. ఐతే. ట్రూకాలర్‌లో కూడా మన వివరాలు తెలియకుండా చేసుకోవాలంటే దానికీ ఛాన్స్ ఉంది. మన నంబర్, నేమ్‌ని ట్రూ కాలర్ నుంచీ తీసివేయించుకోవచ్చు.

ఈ ట్రిక్ తెలుసుకునే ముందు. ట్రూకాలర్ యాప్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. గూగుల్ ప్లే నుంచీ ఈ యాప్ ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ని ట్రూ సాఫ్ట్‌వేర్ స్కాండినేవియా ఏబీ కంపెనీ తయారుచేసింది. దీని సైజ్ 8.6 ఎంబీ మాత్రమే. ఇప్పటికే ఈ యాప్‌ని 50 కోట్ల సార్లకు పైగా గూగుల్ ప్లే నుంచీ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్ లేదా అంతకంటే అప్‌డేటెడ్ వెర్షన్ మొబైళ్లలో మాత్రమే పనిచేస్తుంది.

ట్రూకాలర్‌లో ముఖ్యమైన ఫీచర్లు :

* నంబర్ వివరాలు తెలుసుకోవచ్చు
* ఏ కాల్ అయినా, బ్లాక్ చెయ్యవచ్చు. సేల్స్ కాల్స్ కూడా.
* ట్రూకాలర్ నుంచి కూడా కాల్ చెయ్యవచ్చు
* ఫలానా నంబర్‌తో ఎవరైనా మాట్లాడుతూన్నారో లేదో తెలుసుకోవచ్చు.

ట్రూకాలర్ నుంచీ నంబర్ తీసేయడం ఎలా?

ట్రూకాలర్ నుంచీ మీ నంబర్ తొలగించాలంటే. ముందు మీ మొబైల్‌లో ట్రూకాలర్ యాప్ ఉండకూడదు. తద్వారా ఆ నంబర్‌ను ట్రూకాలర్ గుర్తించలేదు. సోషల్ మీడియాలో మొబైల్ నంబర్ల డీటెయిల్స్ మాత్రమే ట్రూకాలర్ సేకరిస్తుంది. అదే సోషల్ మీడియాలో (ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సావ్, ఇతర వెబ్‌సైట్లలో ) మీ నంబర్ ఉండకుండా చేసుకోవాలి. అప్పుడు మీ నంబర్‌ను ట్రూకాలర్ ట్రాక్ చెయ్యలేదు. ఒకవేళ ట్రూకాలర్ ఎప్పుడో మీ నంబర్ ట్రాక్ చేసి ఉంటే. దాన్ని తొలగించేందుకు ఇలా చెయ్యండి.

* మీ మొబైల్‌లో ట్రూకాలర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చెయ్యండి.
* యాప్ ఓపెన్ చేసి, మెనూలోకి వెళ్లండి.
* సెట్టింగ్ లోకి వెళ్లండి.
* ప్రైవసీ కార్నర్‌లోకి వెళ్లండి.
* డీయాక్టివేట్ ఆప్షన్ ఎంచుకోండి.
ఇప్పుడు ట్రూకాలర్ యాప్‌లో మీ నంబర్ డీయాక్టివేట్ అయినట్లు. వెంటనే మీరు ఆ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చెయ్యండి. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ నంబర్‌ని వాడకుండా ఉంటే. ట్రూకాలర్ దాన్ని గుర్తించలేదు. ఐఫోన్, విండోస్ ఫోన్లకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :