Friday, December 27, 2019

Fastatg services through upi



Read also:

నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఎన్‌ఈటీసీ) ఫాస్టాగ్‌లను భీమ్‌ యూపీఐ ద్వారా కూడా రీచార్జ్‌ చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. దీనితో ఫాస్టాగ్‌ రీచార్జ్‌ ప్రక్రియ మరింత సులభతరం కాగలదని సంస్థ సీవోవో ప్రవీణ రాయ్‌ తెలిపారు. టోల్‌ చెల్లింపునకు సంబంధించి వాహనదారుల సమయం వృధా కాకుండా చూసేలా ‘ఫాస్టాగ్‌’ అమల్లోకి  రావడం తెలిసిందే. ప్రీపెయిడ్‌ లేదా సేవింగ్స్‌ అకౌంటుకు అనుసంధానించే ఫాస్టాగ్‌ ట్యాగ్‌లను వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికిస్తారు. టోల్‌ప్లాజాల్లో  ఏర్పాటు చేసిన రీడర్లు వీటిని స్కాన్‌ చేశాక.. వాహనదారు ఖాతా నుంచి నిర్దేశిత టోల్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దీనివల్ల టోల్‌ ప్లాజాల్లో వాహనాల రద్దీ తగ్గడంతో పాటు వాహనదారుల సమయం కూడా ఆదా అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :