Thursday, December 26, 2019

Deposit rules changed in ppf accounts



Read also:

పబ్లిక్ ప్రొవిడియంట్ ఫండ్ (PPF) అకౌంట్లలో డిపాజిటల్ రూల్స్ మారిపోయాయి. కస్టమర్ల నుంచి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్టు ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పోస్టు ఆఫీసుల్లో నగదు జమ చేసే ఖాతాదారులు చెక్ ద్వారా ఇతర హోం బ్రాంచుల్లో కూడా డిపాజిట్ చేసుకోవచ్చు.

మొన్నటివరకూ ఒక రోజులో నాన్ హోం బ్రాంచులో గరిష్టంగా రూ.25వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసే అవకాశం ఉంది. తపాలా కార్యాలయాల్లోని PPF, పోస్టు ఆఫీసు చిన్నమొత్తాల్లో పొదుపు (POSS) పథకాలు, సుకన్య సమృద్ధి అకౌంట్ (SSA), రికరింగ్ డిపాజిట్ (RD) పొదుపు ఖాతాల్లో మునపటి రూ.25వేల పరిమితే వర్తిస్తుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్టు ఒక ప్రకటనలో తెలిపింది
ఏదైనా కోర్ బ్యాంకింగ్ సొల్యుషన్స్ బ్రాంచ్ లేదా CBS జారీ చేసిన తపాల కార్యాలయ సేవింగ్స్ బ్యాంకులు లేదా అన్ని POSB చెక్కులను ఇతర తపాల శాఖ బ్రాంచుల్లో స్వీకరించవచ్చు. కానీ, క్లియరన్స్ కోసం పంపడం జరగదు. నాన్ హోం బ్రాంచ్ డిపాజిట్లపై మాత్రం గరిష్ట పరిమితి వర్తించదు.
'ఏదైనా CBS పోస్టు ఆఫీసు జారీ చేసిన అన్ని POSB చెక్కులను ఏదైనా CBS పోస్టు ఆఫీసుల్లో సమర్పిస్తే.. ఆయా చెక్కులను పార్ చెక్కులుగా పరిగణించాలే తప్ప క్లియరెన్స్ కోసం పంపరాదు' అని డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్టు ఒక ప్రకటనలో తెలిపింది.
ఏదిఏమైనా.. పోస్టు ఆఫీసు బ్రాంచ్ ల్లో రూ.25వేల కంటే ఎక్కువ నగదు విత్ డ్రాను నాన్ హోం బ్రాంచుల్లో అనుమతించదు. ఒక రోజులో ఇతర SOL (సర్వీసు ఔట్ లెట్స్) వద్ద క్యాష్ విత్ డ్రాకు రూ.25వేల కంటే ఎక్కువగా POSB చెక్కులను అంగీకరించదని ప్రకటనలో పేర్కొంది. PPF ఖాతాదారులకు ప్రయోజనార్థమై ప్రభుత్వం డిపాజిట్ రూల్స్ సవరించింది.
కొత్త రూల్స్ ప్రకారం.ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాదారులు రూ.50లకు ఎన్నిసార్లు అయినా మల్టిపుల్స్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఒక ఏడాదిలో మిశ్రమ జమ (కంబైండ్ డిపాజిట్) గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు అనుమతి ఉంటుంది. ఇప్పటివరకూ ఒక ఏడాది కాల పరిమితిలో గరిష్టంగా 12 డిపాజిట్ల వరకు మాత్రమే అనుమతి ఉంది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :