Thursday, December 19, 2019

current bill link with aadhar card



Read also:

- నెలకు 300 యూనిట్లు దాటి వాడితే అనర్హత వేటు
- పలు శాఖల నుంచి వివరాల సేకరణ
- ఆందోళనలో లబ్ధిదారులు
మీ కుటుంబం నెలకు 300 యూనిట్లు విద్యుత్తును వినియోగిస్తుందా? అయితే, మీరు ప్రభుత్వం ఇచ్చే పింఛనుకు ఇకపై అనర్హులు. ఇంతవరకు పింఛను వస్తున్నా ఇకపై వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం కొత్తగా విధించిన పలు నిబంధనలు పింఛనుదారులకు ఆశనిపాతం కానుంది. గత ఐదు నెలల్లో నెలకు ఎన్ని యూనిట్లు వాడారు? ఎంత విద్యుత్తు బిల్లు వచ్చింది? అనే వివరాలు సమర్పించాలని పింఛనుదారులను అధికారులు కోరినట్లు సమాచారం.గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.పది వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు ఆదాయం ఉన్నా, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వోద్యోగం చేస్తున్నా, 750 చదరపు అడుగుల ఇళ్లున్నా అటువంటి కుటుంబాల్లోని వారికి పింఛను రద్దు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు శాఖల వివరాల ఆధారంగా సర్వే మొదలు పెట్టారు. దీంతో, పింఛనుదారుల్లో కలకలం మొదలైంది. కృష్ణా జిల్లా చల్లపల్లిలోని పింఛనుదారులు విద్యుత్తు కార్యాలయాల వద్ద బుధవారం పడిగాపులు కాశారు. తమకు గత ఐదు నెలల స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని విద్యుత్తు శాఖాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరికి విద్యుత్తు శాఖాధికారులు ఈ స్టేట్‌మెంట్‌ను అందజేశారు. మరి కొంతమందికి గురువారం ఇస్తామని చెప్పి పంపించారు. కొన్ని కుటుంబాల వారి విద్యుత్తు వినియోగం 300 యూనిట్లు పైబడి ఉన్నట్లు సమాచారం. ఇటువంటి కుటుంబాల్లోని వారు తమకు జనవరిలో పింఛను అందుతుందో? లేదో? అని ఆందోళన చెందుతున్నారు. వికలాంగులను కూడా విద్యుత్తు వివరాలు అడుగుతుండడంతో యూనిట్ల వివరాల కోసం వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పింఛనుకు అర్హులైన వారు కుటుంబంలో ఎంతమంది అర్హులున్నా, వారిలో ఒక్కరికే ప్రభుత్వం పింఛను ఇస్తోంది. 80 శాతానికి పైగా వికలాంగత్వం ఉంటే మాత్రం రెండో పింఛనుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. విద్యుత్తు వినియోగానికీ, పింఛనుకు లంకె పెట్టి పింఛను కూడా కోత పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వైసిపి ప్రభుత్వం వచ్చాక పింఛను పెరిగిందనే అనందం పింఛనుదారులున్నారు. ప్రభుత్వ నిబంధనలో వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 58 వేల మందికి రద్దు కానున్న పింఛన్లు

శ్రీకాకుళం జిల్లాలో 58,198 మందిని అనర్హులుగా గుర్తించారు. జిల్లాలో సామాజిక భద్రత కింద 3,42,188 మందికి దాదాపు నెలకు రూ.83.44 కోట్లు పింఛను అందుతోంది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళ తదితర విభాగాల వారికి నెలకు రూ.2,250 అందజేస్తున్నారు. వికలాంగులకు, డప్పు కళాకారులకు రూ.మూడు వేలు, డయాలసిస్‌ రోగులకు రూ.10 వేలు చొప్పున అందజేస్తున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 3,14,430 మంది, అర్బన్‌ ప్రాంతంలో 27,758 మంది పింఛన్లు అందుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే పింఛన్లు అందుకుంటున్న కుటుంబాలకు సంబంధించి రెవెన్యూ, ఆదాయ పన్నుశాఖ, రవాణా, విద్యుత్తు శాఖల నుంచి వివరాలు తెప్పించుకొని ఆధార్‌ కార్డు నంబరు ఆధారంగా లబ్ధిదారుల రద్దు జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాను ఎంపిడిఒలు పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులకు అందజేశారు. జిల్లా అధికారులు ఈ జాబితాలను మండల అధికారులకు పంపించి మరోసారి సర్వే చేస్తున్నారు. రద్దు జాబితాలో పేర్లున్నాయని తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :