Thursday, December 19, 2019

combine the 5 corporate companies to improve the ap schools



Read also:

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధికి ఐదు కార్పొరేట్ సంస్థలు తోడ్పాటు

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు నిర్వహించనున్న నాడు నేడు కార్యక్రమానికి ఐదు కార్పొరేట్ సంస్థలు తోడ్పాటు ఇవ్వనున్నాయి. ఇందుకోసం హెటిరో, వసుధ ఫార్మా, ఆదిశిల ఫౌండేషన్, లారస్ ల్యాబ్స్, రెయిన్ కార్బస్ సంస్థలు ముందుకొచ్చాయి. పాఠశాల విద్యాశాఖ ద్వారా గుర్తించిన 2,566 ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడు కింద ఈ సంస్థలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్... ప్రభుత్వ స్కూళ్లు దారుణమైన స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 45 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లను 12 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
ఇంగ్లీష్ ల్యాబ్ సహా 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టమని స్పష్టం చేశారు. కచ్చితంగా ప్రతి స్కూల్లో ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు. వచ్చే నెల నుంచి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మ ఒడి పథకం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా స్కూళ్లకు పంపించే పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసే ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :