Tuesday, December 3, 2019

Change the sbi atm card



Read also:

SBI Card: మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డు మార్చలేదా? డిసెంబర్ 31 డెడ్‌లైన్

మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- SBI డెబిట్ కార్డు ఉందా? మీరు ఇంకా పాత ఏటీఎం కార్డే వాడుతున్నారా? అయితే మీ పాత ఏటీఎం కార్డ్ త్వరలో పనిచేయకపోవచ్చు. అందరూ ఈఎంవీ చిప్ ఉన్న కార్డు మాత్రమే ఉపయోగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలాకాలంగా చెబుతోంది. కానీ.ఇప్పటికీ ఇంకా పాత కార్డులే అంటే ఈఎంవీ చిప్ లేని కార్డులే ఉపయోగిస్తున్న కస్టమర్లు ఉన్నారు. వారు కొత్త కార్డులు తీసుకోకపోతే పాత కార్డులు పనిచేయవు. మరి మీరు ఇప్పటికీ మ్యాగ్నెటిక్ స్ట్రైప్స్ ఉన్న కార్డులే ఉపయోగిస్తున్నట్టైతే వాటిని వెంటనే ఈఎంవీ చిప్ కార్డులోకి మార్చుకోవాలి. ఇందుకోసం మీకు డిసెంబర్ 31 వరకే అవకాశం ఉంది.
SBI-atm-card
మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఓసారి చెక్ చేసుకొని, కార్డుపై ఈఎంవీ చిప్ లేకపోతే కొత్త కార్డు కోసం అప్లై చేయాలి.మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డ్ నుంచి ఈఎంవీ చిప్ కార్డుకు మారేందుకు మీరు ఎలాంటి ఫీజు, ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉచితంగానే కార్డులను అప్‌డేట్ చేస్తుంది. ఏటీఎం మోసాలు, సైబర్ చీటింగ్ అడ్డుకోవడానికి చిప్ ఉన్న కార్డులు ఉపయోగపడతాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గైడ్‌లైన్స్ ప్రకారం కస్టమర్లు అందరికీ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న ఈఎంవీ చిప్ కార్డులను జారీ చేస్తోంది ఎస్‌బీఐ. వాస్తవానికి డెడ్‌లైన్ గతంలోనే ముగిసింది. కానీ ఇప్పటికే చిప్ లేని కార్డులు ఉపయోగిస్తున్నవారికి వాటిని మార్చుకోవడానికి మరో అవకాశం ఇచ్చింది ఎస్‌బీఐ. సో... మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డుకు ఈఎంవీ చిప్ లేకపోతే డిసెంబర్ 31 లోగా మార్చుకోండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :