Wednesday, December 25, 2019

Blockage on village secretariat wages



Read also:

గ్రామ సచివాలయ వేతనాలపై ప్రతిష్టంభన-301, 302 ఖాతాల్లో బిల్లులు పెట్టాలన్న ఆదేశాలతో గందరగోళం-గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఒప్పంద ఉద్యోగుల, ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలోని పొరుగు సేవలందిస్తున్న ఉద్యోగులకు చెల్లించే 301, 302 ఖాతాల్లో బిల్లులు పెట్టాలన్న పంచాయతీరాజ్‌శాఖ ఆదేశాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధిక జిల్లాల్లో బిల్లులు పెట్టకుండా అధికారుల తదుపరి ఆదేశాల కోసం సిబ్బంది నిరీక్షిస్తున్నారు. అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. వార్డు సచివాలయాల్లో నియమితులైన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 010 ఖాతాలో వేతనాలు చెల్లించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ లోగడే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అక్టోబరు, నవంబరు వేతనాల కోసం బిల్లులు పెడుతున్నారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల వేతనాలకు సంబంధించి 301, 302 ఖాతాల్లో బిల్లులు పెట్టడానికి సిబ్బంది వెనకడుగు వేస్తున్నారు. ఈ విధానం ఒకసారి అమల్లోకి వస్తే మళ్లీ వెనక్కి రావడం కష్టమని వారు భావిస్తున్నారు. తదుపరి ఆదేశాలివ్వాలని గ్రామ సచివాలయ ఉద్యోగులు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను కోరుతున్నారు. వేతనాల చెల్లింపుల్లో వార్డు సచివాలయ ఉద్యోగులకో విధానం, తమకొకటా? అని వారు ప్రశ్నిస్తున్నారు.

వారివి పర్మినెంట్ ఉద్యోగాలు అని చెప్పిన సర్కార్.. జీతాలు మాత్రం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల జాబితాలో చేర్చి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు జిల్లాల అధికారులు.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి. జీతాలను.. 301, 302 ఖాతాల కింద పంపాలని.. ఆదేశాలు వెళ్లాయి. ఈ ఖాతాల కింద.. ఔట్ సోర్సింగ్, ఒప్పంద ఉద్యోగులకు మాత్రమే జీతాలు ఇస్తాయి. ఒక సారి ఉద్యోగుల్ని ఈ ఖాతాల కింద చూపితే.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మినెంట్ ఉద్యోగులు కారు., వారు ఔట్ సోర్సింగ్ కింద వస్తారు., తర్వాత ప్రభుత్వం విడిగా పర్మినెంట్ చేయడానికి ప్రత్యేకమైన కసరత్తు చేయాల్సి ఉంటుంది. అందుకే.. జిల్లాల అధికారులు.. ఆయా ఖాతాల కింద ఉద్యోగులు బిల్లులు పెట్టేందుకు జంకుతున్నారు.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 010 ఖాతా కింద. జీతాలు పంపిణీ చేస్తారు. ఇలా చేయడం వల్ల.. ఒకటో తేదీన వారికి జీతం అందుతుంది. ఖాజానాలో నిధులుంటే. జీతాలు ఆలస్యం కావు. కానీ ఇతర ఖాతాల కింద ఉంటే మాత్రం.. ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తుంది. దీంతో.. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్లకు ఈ విషయంపై విజ్ఞాపన పత్రాలు అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వమే జీతాలు చెల్లించాల్సి ఉంది. అలాగే.. గ్రామ సచివాలయ ఉద్యోగులకూ చెల్లించాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి మాత్రం.. అంత అనుకూలంగా లేదు.

వారంలో పరిష్కారం: ద్వివేది-గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తలెత్తిన సమస్యలను వారంలో పరిష్కరిస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం ట్వీట్‌ చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :