Friday, December 27, 2019

Be careful while writing the year in any documents



Read also:

కొత్త ఏడాది కోసం అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. పాత సంవత్సరానికి బైబై చెప్పి 2020 ఏడాదికి స్వాగతం పలకాలని ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే కొత్త ఏడాదిపై ఓ ఆసక్తిక విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందులా కాకుండా ఈ ఏడాది రాసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు. దీనికి కొన్ని అంశాలను కూడా ఉదహరిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

సాధారణంగా తేదీలు వేసే సమయంలో కొన్ని సార్లు సంవత్సరంలో చివరి అంకెలను వేసి వదిలేస్తాం. కానీ ఈ ఏడాది మాత్రం అలా చేస్తే చిక్కుల్లో పడిపోయినట్టే. ఎందుకంటే ఈ ఏడాది 01/01/2020 నుంచి ప్రారంభం అవుతుంది. కానీ ఏడాది పూర్తిగా వేయడానికి సులువైన మార్గంగా చాలా మంది 01/01/20 అని రాసే అవకాశం ఉంటుంది.ఇదే అసలు సమస్యను తెచ్చిపెడుతుంది.
దీని వల్ల 01/01/2000 నుంచి 01/01/2099 వరకు ఏదైనా సంవత్సరం అంకెను వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైనా ఒప్పందాలు జరిగే సమయంలో దీన్ని పక్కాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం అనాలోచితంగా ఉన్నా దీని వల్ల మోసపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఏడాదిని రాసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :