Saturday, December 21, 2019

arogya sri cards distribution from january 1



Read also:

1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు
లబ్ధి దారులకు కొత్తవి అందజేత
రోగులకు నాణ్యమైన మందులు
ఏప్రిల్‌కి అందుబాటులో అన్ని రకాలు
మార్చి నాటికి 1060 కొత్త అంబులెన్సులు
నాడు-నేడు సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ పథకంలో లబ్ధిదారులకు కొత్తకార్డులు ఇవ్వనున్నట్టు సీఎం జగన్‌ వెల్లడించారు. ప్రతి లబ్ధిదారునికీ ఇవి వెంటనే చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం రోగులకు మందులు అందించాలని, ఏప్రిల్‌కి అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై శుక్రవారం ఆయన సమీక్షించారు. ఆరోగ్యశాఖ లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలన్నారు. ఎవరైనా మిగిలిపోతే ఎవర్ని సంప్రదించాలి, ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాలను అందులో పొందుపరచాలన్నారు. ‘నాడు-నేడు’ కింద చేపట్టే పనులు నాణ్యతతో ఉండాలని, ఆసుపత్రుల్లో బెడ్లు, బాత్‌రూమ్స్‌ పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి సర్టిఫికెట్‌లు ఇచ్చే పద్ధతి సులభతరంగా ఉండాలన్నారు. రోగుల కోసం ప్రత్యేకంగా వాహన సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరు 2నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగులకు విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని, డిసెంబరు 15నుంచి ఆసుపత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సదరం క్యాంపులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, హీమోఫీలియో, డయాలసిస్‌ రోగులకు రూ.10వేల చొప్పున పెన్షన్‌ ఇస్తున్నట్టు తెలిపారు. బోదకాలు, వీల్‌చైర్లకు పరిమితమైన వారు, తీవ్ర పక్షవాతంతో బాధపడుతున్న వారికి జనవరి నుంచి పెన్షన్లు ఇస్తామన్నారు. కుష్ఠువ్యాధి రోగులకు నెలకు రూ.3 వేల పెన్షన్‌ ఇవ్వనున్నట్టు చెప్పారు.

1060 కొత్త అంబులెన్సులు

ఆసుపత్రుల్లో పారిశుధ్య కార్మికుల జీతాలు రూ.8వేల నుంచి రూ.16వేలకు పెంచుతున్నట్టు సీఎం తెలిపారు. 2020 మార్చి నాటికి 1060 కొత్త(104, 108) అంబులెన్స్‌లు కొనుగోలు చేయనున్నట్టు పేర్కొన్నారు. సదరం క్యాంపుల్లో రద్దీని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. గతంలో వారానికి కేవలం 2,715 స్లాట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 8,680 స్లాట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. కంటి వెలుగులో 4లక్షల మందికి సమస్యలు గుర్తించామన్నారు. జనవరిలో 5వేల హెల్త్‌ సబ్‌సెంటర్ల నిర్మాణం ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జనవరి నాలుగో వారంలో పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. శంకుస్థాపనలు చేసుకుంటేపోతే ఉపయోగం లేదని, శంకుస్థాపన చేసిన ఆరువారాల్లో నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :