Monday, December 23, 2019

Ap Teacher Transfers



Read also:

టీచర్ల బదిలీపై కదలిక, సంక్రాంతి సెలవుల్లో టీచర్ల బదిలీలకు కసరత్త. విద్యాశాఖ లో పనితీరు పాయింట్లు ఎత్తివేత సర్వీసు పాయింట్లే ప్రాతిపదిక వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు.

AP Teachers Transfers Key Points :

1. Teachers Performance Points in this Transfers
2. AP Teachers Transfers based on Service Points
3. Transfers Counseling based on Web Counseling
సంక్రాంతి సెలవుల సమయంలో బదిలీలు చేపట్టే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసిన పాఠశాల విద్యా కమిషనర్‌ తాజాగా ప్రతిపాదిత ఫైలును ప్రభుత్వానికి పంపించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి పరిశీలన అనంతరం దాన్ని రెండు రోజుల క్రితం సాధారణ పరిపాలనశాఖ(జీఏడీ) కు పంపించారు. అక్కడి నుంచి ఫైలు తొలుత న్యాయశాఖకు తర్వాత ఆర్థికశాఖకు వెళుతుంది. స్వల్ప మార్పులతో పాత మార్గదర్శకాలనే అనుసరించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో గతంలో ప్రవేశపెట్టిన పెర్ఫార్మెన్స్‌ పాయింట్లను ఎత్తివేయాలని, సర్వీస్‌ పాయింట్ల ప్రాతిపదికగా బదిలీలు చేపట్టాలని సంకల్పించింది.
ఉపాధ్యాయుని మొత్తం సర్వీసు, ఒక పాఠశాలలో పూర్తిచేసిన సర్వీసును బట్టి పాయింట్లు కేటాయించి.వాటి ప్రాతిపదికగా ప్రాధాన్యతలు కల్పిస్తారు. 

Who are eligible for Transfers 2020

1. ఒక ప్రాంతంలో కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
2. ఒక పాఠశాలలో గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసున్న ఉపాధ్యాయులు,
3. ఐదు సంవత్సరాల సర్వీసున్న ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు.

Web Counseling Schedule for AP Teachers

Transfers schedule will be on Jan 10th to Jan 20th, 2020. జనవరి 10th నుంచి 20th, 2020 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు. ఆ సమయంలో ఉపాధ్యాయులు కూడా ఖాళీగానే ఉంటారు కాబట్టి.. వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియ చేపడితే సమయం ఆదా అవుతుందని, విద్యార్థులకు కూడా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయంతో కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.సదరు ఫైలు జీఏడీ నుంచి న్యాయశాఖకు, అక్కడి నుంచి ఆర్థికశాఖకు వెళ్లాలి. Finally approval by CM Sir.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :