Saturday, December 28, 2019

Amma Vodi list



Read also:

అమ్మఒడి అర్హుల జాబితా నేడు ప్రదర్శన
గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి..
46,78,361 లక్షల మంది తల్లులకు లబ్ధి
జనవరి 2 వరకు అభ్యంతరాల స్వీకరణ.
9న తుది జాబితా ప్రదర్శన ,అదే రోజు నుంచి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ.నేడు గ్రామసభల్లో తీర్మానాలు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు, పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీ అమలులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వైఎస్‌ఆర్‌ నవశకం కింద ఇంటింటికీ గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు. సేకరించిన సమాచారం మేరకు 46,78,361 మంది తల్లులు జగనన్న అమ్మ ఒడికి లబ్ధి దారులుగా తేలారు.

జనవరి 9న తుది జాబితా ప్రదర్శన

ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు. అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న  లబ్ధిదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు,అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు.

నేడు గ్రామసభల్లో తీర్మానాలు-DEO

MEO లు జాబితాలు డౌన్లోడ్ చేసుకుని గ్రామ సచివాలయ కార్యదర్శులకు అందించాలని సూచించారు. వారు గ్రామసభ నిర్వహించి అర్హులు, అనర్హుల జాబితాలను చదివి విని పిస్తారన్నారు. అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చన్నారు. గ్రామసభలో తీర్మానం చేశాక ఆ కాపీలను ఎంఈవో ద్వారా ఈ నెల 29న డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు. పరిశీలన అనంతరం.3O న కలెక్టర్ కు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపుతారని వివరించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :