Friday, December 27, 2019

Airtel prepaid plan reduced the validity and add some extra features



Read also:

ఎయిర్‌టెల్ రూ. 558 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ సవరణ చేసింది. టెలికాం ఆపరేటర్ ఈ నెల ప్రారంభంలో దాని మొత్తం పోర్ట్‌ఫోలియోను సవరించారు. ఇప్పుడు ఎయిర్‌టెల్ రూ. 558 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీని తగ్గించింది. కానీ దాని మిగతా ప్రయోజనాలన్నీ అలాగే ఉన్నాయి.

ఎయిర్‌టెల్ ఇటీవలే ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వై-ఫై కాలింగ్ సేవను ప్రవేశపెట్టింది, వినియోగదారులకు సాధారణ వాయిస్ కాల్ లాగానే వై-ఫై నెట్‌వర్క్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు.దీనికి ప్రత్యేక యాప్ అవసరం లేదు. వినియోగదారులు కాల్స్ చేసేటప్పుడు చేయవలసింది Wi-Fi కాలింగ్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.
558 ప్రీపెయిడ్ ప్లాన్, ప్రయోజనాలు నిజంగా ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 3 జిబి డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్. అయితే దీని వాలిడిటీ 82 రోజుల నుండి 56 రోజులకు తగ్గించారు అంటే 26 రోజుల వాలిడిటీని తగ్గించారు. ఈ ప్లాన్ అదనపు ప్రయోజనాలు ఏంటంటే షా అకాడమీలో ఉచితంగా నాలుగు వారాల పాటు ఫోటోగ్రఫీ, సంగీతం ఇంకా ఏదైనా నేర్చుకోవచ్చు.

కానీ ఈ ప్లాన్ ప్రయోజనాల వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే. ఇతర యాడ్-ఆన్‌లలో వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, జీ 5, హెచ్‌ఓఓకే, 370+ లైవ్ టివి ఛానెల్‌లు, 10వేలకి పైగా చలనచిత్రాల నుండి కంటెంట్‌ను అందించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఇస్తుంది. ఈ ప్యాక్‌లో ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ. 100 క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. సవరించిన ఎయిర్‌టెల్ రూ. 558 ప్యాక్ అన్ని సర్కిల్‌లలో లభిస్తుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ ఇటీవల మరో ఆరు ఫోన్‌లకు వై-ఫై కాలింగ్‌ సపోర్ట్ అందిస్తోంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10, గెలాక్సీ ఎస్ 10 +, గెలాక్సీ ఎస్ 10 ఇ, గెలాక్సీ ఎం 20, అలాగే వన్‌ప్లస్ 6, వన్‌ప్లస్ 6 టి వీటిని వాయిస్ ఓవర్ వైకి మార్చడానికి సపోర్ట్ చేస్తుంది. ఈ సర్విస్ ప్రస్తుతం ఢిల్లీ/ ఎన్‌సిఆర్‌లో మాత్రమే ప్రత్యక్షంగా ఉంది, అయితే ఇది త్వరలో అన్ని ప్రధాన నగరాలకు అందుబాటులోకి వస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :