Friday, December 27, 2019

AirForce job notification



Read also:

ఎయిర్ ఫోర్స్ 2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిర్ ఫోర్స్ లో పదోతరగతి నుంచి పీజీ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఎయిర్‌మెన్, టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రాడ్యుయేట్లకు ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీలకు సంబంధించిన పోస్టులను ప్రతి సంవత్సరం వాయుసేన నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఇది ఒక అధ్భుతమైన అవకాశం. ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై సంభందించి ఎయిర్‌మెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ కనీస అర్హత కలిగిన వారు దీనికి అర్హులు.

గ్రూప్ ఎక్స్ పోస్టులకు ఎంపికైన వారు టెక్నికల్ ఫీల్డ్‌లో పని చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ విభాగానికి సంభందించి (ఆటోమొబైల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్, ఎలక్ట్రికల్ ఫిట్టర్, మెకానికల్ సిస్టమ్ ఫిట్టర్, స్ట్రక్చర్స్ ఫిట్టర్, ప్రపొల్షన్ ఫిట్టర్, వర్క్‌షాప్ ఫిట్టర్, వెపన్ ఫిట్టర్).
నాన్ టెక్నిల్ విభాగానికి సంభందించి ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్.

గ్రూప్-ఎక్స్ పోస్టుకు అర్హత : ఇంటర్ లేదా తత్సమాన విద్యలో (మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి లేదా మూడేండ్ల ఇంజనీరింగ్ డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డిప్లొమాలో ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు తప్పనిసరిగా స్కోర్ చేసి ఉండాలి. గ్రూప్ ఎక్స్ పోస్టులకు డిప్లొమా చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

గ్రూప్ వై పోస్టుల కేటగిరీ కింద ఎంపికైన వారు టెక్నికల్ (కమ్యూనికేషన్ టెక్నీషియన్, ఆటోమొబైల్ టెక్నీషియన్), నాన్ టెక్నికల్ (అడ్మిన్ అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, మెడికల్ అసిస్టెంట్, లాజిస్టిక్ అసిస్టెంట్, ఎన్విరాన్‌మెంట్ సపోర్ట్ సర్వీసెస్ అసిస్టెంట్, ఆపరేషన్స్ అసిస్టెంట్, మెటీరియాలజీ అసిస్టెంట్, గ్రౌండ్ ట్రెయినింగ్ అసిస్టెంట్, ఐఏఎఫ్ పోలీస్, సెక్యూరిటీ, మ్యూజీషియన్ వంటి వాటిలో పని చేయాల్సి ఉంటుంది.

గ్రూప్-వైపోస్టుకు అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ 50 శాతం మార్కులు పొంది ఉండాలి లేదా రెండేండ్ల వొకేషనల్ ఇంటర్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. వొకేషనల్ కోర్సులో ఇంగ్లిష్ సబ్జెకులో 50 శాతం మార్కులు తప్పనిసరి పొందాలి.

వయస్సు: అభ్యర్ధి జనవరి 17 2000 నుంచి డిసెంబర్ 30 2003 మధ్య జన్మించి ఉండాలి. గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్‌కు ఇంటర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

శారీరక ప్రమాణాలు: కనీసం 152.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతీ కనీసం 5 సెం.మీ. పెరగలి.

ఎంపిక విధానం: మొత్తం రెండు దశల్లో ఎంపికలు ఉంటాయి. ఫేజ్-1లో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది, దీనిలో అర్హత సాధించినవారిని ఫేజ్-2కు ఎంపిక చేస్తారు. ఫేజ్-1 పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు నెగటివ్ మార్క్స్ విధిస్తారు. ఫేజ్-2లో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. దీనిలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

శిక్షణ: మొదట 20 ఏండ్ల కాలపరిమితికి ఈ పోస్టులను భర్తీ చేస్తారు. జాయింట్ బేసిక్ ఫేజ్ ట్రెయినింగ్ ఇచ్చి అనంతరం ఆయా ట్రేడ్‌లలో శిక్షణ ఇస్తారు.

వేతనం: అభ్యర్డులకు శిక్షణ కాలంలో నెలకు రూ.14,600 ఇస్తారు. శిక్షణ తర్వాత గ్రూప్ ఎక్స్ వారికి నెలకు ప్రారంభ వేతనం రూ.33,100 గ్రూప్ వై వారికి రూ.26,900 ఇస్తారు. అదనంగా డీఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. అంతేకాకుండా రేషన్, దుస్తులు, వైద్యం, వసతి, క్యాంటీన్, సెలవులు, ట్రాన్స్‌పోర్ట్ తదితర సౌకర్యాలను ఐఏఎఫ్ కల్పిస్తుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం తేదీ 2 జనవరి 2020, చివరితేదీ 20 జనవరి 2020
పరీక్ష ఫీజు: రూ.250/-
పరీక్ష తేదీలు: మార్చి 19 నుంచి 23 వరకు
మరింత సమాచారం కోసం అఫిషియల్ వెబ్‌సైట్:https://airmenselection.cdac.in/ https://indianairforce.nic.in సందర్శించండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :