Thursday, December 12, 2019

aadhar linking is mandateory for pm kisan scheme



Read also:

PM KISAN పీఎం కిసాన్ స్కీం నిధులు కావాలంటే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే

ఈ డిసెంబర్ నుంచి, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన (పిఎం-కిసాన్) కింద అర్హులైన రైతులకు అకౌంట్లలో డబ్బులు పడాలంటే, బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయాల్సిందేనంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ డిసెంబర్ 10 న లోక్‌సభలో తెలిపారు. పిఎం-కిసాన్ పథకం కింద 14 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తారు.
ఆధార్ లింక్‌కి సంబంధించి.. 2020 మార్చి వరకు అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ రైతులకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. మిగతా అన్ని రాష్ట్రాలకు డిసెంబర్ (2018 - మార్చి 2019) తొలి విడత డబ్బులు ఎటువంటి నిబంధనలు లేకుండానే అకౌంట్లలో జమచేసింది.
రెండో దఫా నుంచి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాకపోతే ఆధార్ లింకేజ్‌లో ఆలస్యం కారణంగా రెండో దఫా, మూడో దఫా సాయాన్ని కూడా చాలామందికి చెల్లించింది. ఫైనల్‌గా లింక్ చేసునేందుకు నవంబర్ 30 వరకు ప్రభుత్వం సడలింపునిచ్చింది. గడువు ముగిసిపోవడంతో డిసెంబర్ నుంచి కేవలం బ్యాంకు ఖాతా, ఆధార్‌కి లింక్ అయి ఉన్నవారికే డబ్బులు జమవుతాయని తోమర్ తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :