Monday, December 30, 2019

New year celebrate 2 times in this country



Read also:

మనకు తెలుసు.ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరాన్ని ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఎక్కడి దాకో ఎందుకు. మన దేశంలోనే న్యూఇయర్‌. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుగుతుంది. సరే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ రేంజ్‌లో కొత్త విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నది జూలియన్ కేలండర్ లేదా గ్రెగొరియన్ కేలండర్. దీని ప్రకారమే జనవరి 1ని సంవత్సరంలో మొదటి రోజుగా భావిస్తున్నారు. ఐతే. క్రీస్తు పుట్టక ముందు 2000 సంవత్సరాల నుంచే. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నారని తెలిసింది. రష్యాలో కొత్త సంవత్సర వేడుకల్ని ఒకే సంవత్సరంలో రెండుసార్లు జరుపుకుంటారు. ఎందుకంటే. టైమ్ జోన్ల సమస్య.
సాధారణంగా సూర్యుడు ముందుగా ఉదయించే ప్రదేశంగా జపాన్‌ని చెప్పుకుంటారు. అందుకే ఆ దేశాన్ని నిప్పన్ అని కూడా అంటారు. నిప్పన్ (Nippon) అంటే సూర్యుడు ఉదయించే ప్రాంతం అని అర్థం. కానీ న్యూఇయర్ వేడుకలు మాత్రం ప్రపంచంలో ముందుగా జరిగేది న్యూజిలాండ్‌లో. అక్కడి ఛాధమ్ దీవుల్లో రాత్రి 12 అవ్వగానే. ప్రజలు ఎగిరి గంతేస్తారు. అలా న్యూఇయర్ మొదలవుతుంది.

అందరూ వేడుకలు జరిపేసుకున్నాక. చివరిగా అమెరికాలోని సమోవా దీవుల్లో న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటారు. ఇప్పుడు మనం అసలు మేటర్‌కి వద్దాం. ఒకే రోజులో రెండుసార్లు న్యూఇయర్ జరుపుకునే ప్రదేశంగా. ఛాధమ్, సమోవా దీవుల సముదాయాన్ని పిలుస్తారు. ఎందుకంటే వీటి మధ్య దూరం 891 కిలోమీటర్లే. సో. ఎవరైనా ఒకే రోజు రెండుసార్లు న్యూఇయర్ జరుపుకోవాలనుకుంటే. ముందుగా డిసెంబర్ 31 అర్థరాత్రి కల్లా. ఛాధమ్ దీవులకు చేరాలి. అదే రోజు రెండోసారి జరుపుకునేందుకు. ఫ్లైట్ ఎక్కి. సమోవా దీవుల్ని చేరుకుంటే. ఒకే ప్రదేశంలో రెండుసార్లు జరుపుకున్న ఫీల్ పొందగలరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :