Saturday, December 14, 2019

3 indians in forbes list



Read also:

ఫోర్బ్ శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయ మహిళలకు చోటు

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది ఫోర్బ్ జాబితాలో ముగ్గురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. వీరిలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 34వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. అలాగే హెచ్‌సిఎల్ కార్పొరేషన్ సిఇఒ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోష్ని నాదర్ మల్హోత్రా 54వ స్థానంలో, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా 65వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్ ఈ జాబితాను శుక్రవారం విడుద ల చేసింది. ఈ జాబితాలో సీతారామన్ క్వీన్ ఎలిజబెత్2(ర్యాంక్ 40), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్ (ర్యాంక్ 42) కంటే ఎక్కువ స్థానంలో ఉన్నారు. సీతారామన్ దేశీయ మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థికమంత్రి. ఆమె జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు.రాజకీయాల్లో చేరడానికి ముందు సీతారామన్ అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ బ్రిటన్, బిబిసి వరల్డ్ సర్వీస్‌తో కూడా సంబం ధం కలిగి ఉన్నారు. దేశంలోని ప్రముఖ టెక్ కంపె నీ హెచ్‌సిఎల్ టెక్ వ్యూహాత్మక నిర్ణయాలకు రోష్ని నాదర్ బాధ్యత వహిస్తారు. ఆమె సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) కమిటీ చైర్‌పర్సన్, శివ నాదర్ ఫౌండేషన్ ధర్మకర్త. దీని కింద దేశంలో చాలా పెద్ద కళాశాలలు, పాఠశాలలు నడుస్తున్నా యి.
కిరణ్ మజుందార్ షా దేశంలోని అత్యంత ధనవంతురాలు. 1978లో ఆమె దేశంలోని అతిపెద్ద బయోటెక్ కంపెనీ బయోకాన్‌ను స్థాపించారు. బయోకాన్ ఉత్పత్తులు యుఎస్‌లో కూడా విజయవంతమయ్యాయి. కొన్ని క్యాన్సర్ల రెండు వేర్వేరు జీవ ఔషధాల కోసం యుఎస్ డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందిన మొదటి సంస్థ బయోకాన్.
షా బయోకాన్‌లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు భారీగా పెట్టుబడులు పెట్టారు. మజుందార్ షా మెడికల్ సెంటర్ ద్వారా సామాజిక సేవలు అందిస్తున్నారు. ఫోర్బ్ ప్రకారం, షా నికర విలువ రూ.21,957 కోట్లు. ఫోర్బ్స్ జాబితాలో ఏంజెలా మెర్కెల్ మొదటి స్థానం లో ఉన్నారు.
ఆమె 2005లో జర్మనీకి మొదటి మహిళా చాన్స్‌లర్. రెండవ స్థానంలో యూరోపియ న్ సెంట్రల్ బ్యాంక్ మొదటి మహిళా అధ్యక్షురాలు క్రిస్టిన్ లగార్డ్ ఉన్నారు. యుఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి మూడవ ర్యాంకును కలిగి ఉన్నారు. ఈ జాబితాలో కిరణ్ మజుందార్ షాతో సహా 13 మంది బిలియనీర్ మహిళలు ఉన్నారు.
వీరి మొత్తం నికర విలువ 6.14 లక్షల కోట్ల రూపాయలు. అమెరికన్ కంపెనీ జనరల్ మోటార్స్ సిఇఒ మేరీ బార్రా 5వ స్థానంలో ఉన్నారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్ మిలిండా గేట్స్ ఆరో స్థానంలో నిలిచారు. ఫేస్బుక్ సిఒఒ షెరిల్ శాండ్బర్గ్ 18వ స్థానంలో ఉన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :