Tuesday, December 24, 2019

2021 census information



Read also:

వచ్చే ఏడాది నుంచి జనాభా లెక్కలు. NPRకి కేంద్ర కేబినెట్ ఆమోదం

2021 జనాభా లెక్కల ప్రక్రియ, జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) అప్‌డేషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు జనగణన చేపట్టనున్నారు. జనగణన కోసం రూ.8,500 కోట్లు, NPR అప్‌డేషన్ కోసం రూ.3941 కోట్లు కేటాయించింది. మొత్తంగా సుమారు రూ.13,000 కోట్లు దీని కోసం ఖర్చు చేయనున్నారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్‌కు వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు జరుగుతున్న వేళ కేంద్ర ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం యాప్‌తోనే జనాభా పట్టిక అప్‌డేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు.దేశంలోని ప్రతి సాధారణ వ్యక్తికి చెందిన సమగ్ర గుర్తింపు డేటాబేస్‌ను సృష్టించాలనే లక్ష్యంతో ఈ ఎన్‌పీఆర్‌ను తీసుకొచ్చింది.
ప్రతి సాధారణ పౌరుడు ఈ ఎన్‌పీఆర్‌లో తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. వేలి ముద్రలు కూడా అవసరం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. కేవంల సెల్ఫ్ డిక్లరేషన్‌ ఇస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా 16వ సారి జనగణనకు కేబినెట్ ఆమోదం

  • జాతీయ జనాభా పట్టిక(నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌- ఎన్‌పీఆర్​) కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది
  • ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2020 వరకు జనాభా లెక్కింపు.జనాభా లెక్కల రిజిస్టర్‌లో వివరాలు నమోదుకు రూ.3,941 కోట్లు..పేపర్ సాయం లేకుండా యాప్ ద్వారా జనాభా లెక్కింపు
  • వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న జాతీయ జనాభా పట్టికకు కేంద్రం బడ్జెట్ కేటాయించింది
  • దేశంలో ఉన్న ప్రతీ పౌరుడి వివరాలను రూపొందించేది జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పిఆర్). ఈ డేటాబేస్‌లో ప్రతి ఒక్కరి వివరాలతో పాటుగా బయోమెట్రిక్స్‌ను కూడా పొందుపరుస్తారు
  • జనగణనపై జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత జిల్లాస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.
  • వచ్చే ఏడాది ఏప్రిల్‌ 20 నుంచి సెప్టెంబర్‌ వరకు ఇళ్ల గణన చేపడతారు. అనంతరం జనాభా గణన నిర్వహిస్తారు.
  • ప్రతి పదేళ్లకు నిర్వహించే జనాభా గణనకు సంబంధించి రాష్ట్రస్థాయిలో మాస్టర్‌ శిక్షకులుగా జిల్లా నుంచి నలుగురు అధికారులు ఎంపికకాగా, హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇటీవల వారం రోజులపాటు శిక్షణ ఇచ్చారు.
  • పెడన ఎమ్యీవో బవిరి శంకర్‌నాథ్‌, మచిలీపట్నం ఎమ్యీవో దుర్గాప్రసాద్‌, విజయవాడ స్టాటిస్టికల్‌ విభాగంలో పని చేస్తున్న రజనీష్‌, తిరుపతిరెడ్డి ఈ శిక్షణ పూర్తి చేశారు.
  • కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో అధికారులకు వీరు శిక్షణ ఇవ్వనున్నారు.
  • ఈసారి సాంకేతికతను ఉపయోగించుకుని *ట్యాబ్‌లో యాప్‌ ద్వారా* సమాచారాన్ని నిక్షిప్తం చేయటానికి ప్రాధాన్యత ఇస్తారని ఎమ్యీవో శంకర్‌నాథ్‌ తెలిపారు.

జనగణనకు ప్రత్యేక యాప్‌: 

కాగితంతోనే కాకుండా మొబైల్‌ ద్వారా కూడా జనగణన-2021 వివరాలు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. 2020 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సచివాలయంలో జనాభా గణన-2021పై సీఎస్‌ నీలం సాహ్ని శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.‘వివరాల నమోదుకు 28 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని రూపొందించాం. బ్యాంకు ఖాతా, వీసా, మొబైల్‌ నంబరు సేకరిస్తాం. నమోదుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించాం’ అని తెలిపారు.
జనగణన 45 రోజులు
ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్యలో నిర్వహణ
ఏర్పాట్లపై సీఎస్‌ జోషి సమీక్ష
జాతీయ జనాభా గణన–2021 లో భాగంగా వచ్చే ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య 45 రోజులు రాష్ట్రంలో తొలి విడత జనాభా లెక్కల సేకరణ నిర్వహించనున్నామని సీఎస్‌ ఎస్‌కే జోషి వెల్లడించారు. 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు రెండో విడత నిర్వహిస్తామని చెప్పారు.
71,136 మంది ఎన్యూమరేటర్లు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. జనాభా గణన–2021 కార్యక్రమం ఏర్పాట్లపై సోమవారం ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. 65 మంది మాస్టర్‌ ట్రైనర్లకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో తొలి విడత శిక్షణ ముగిసిందని, రెండో విడత సోమవారం నుంచి 7 వరకు జరుగుతుందని చెప్పారు.
జనాభా లెక్కల సేకరణలో భాగంగా గృహాల జాబితాల తయారీ, జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిస్ట్రర్‌ను నవీకరిస్తారని వెల్లడించారు. వ్యక్తుల వివరాలతో పాటు సాంఘిక, సాంస్కృతిక, భౌగోళిక, ఆర్థికపర వివరాలను సేకరిస్తారని చెప్పారు. ఎన్యూమరేటర్లు తమ మొబైల్‌ ఫోన్‌ యాప్‌తో పాటు కాగితపు దరఖాస్తులను నింపడం ద్వారా జనాభా వివరాలను సేకరిస్తారన్నారు. జనాభా గణన వ్యవహారాల డైరెక్టర్‌ కె.ఇలంబర్తి ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :