Tuesday, November 19, 2019

Vindam nerchukundam radio lesson



Read also:

Vindam Nerchukundam Today lesson

vindam-nerchukundam-radio-lessons
vindam-nerchukundam-radio-lessons
★ తేది : 19.11.2019
★ విషయము :  తెలుగు
★ పాఠం పేరు : "లడ్డూ బాధ"
★ తరగతి : 3వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
• సంభాషణల ద్వారా గేయ సారాంశాన్ని వివరించడం.
• గేయాన్ని రాగయుక్తంగా పాడించడం, అభినయింపజేయడం.
• పిల్లల్లో హాస్యాన్ని ఆస్వాదించే గుణాన్ని పెంపొందింపజేయడం.
• విన్న అంశంపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పించడం.
• సూచించిన పదార్థాల గురించి మాట్లాడించడం.
• సూచించిన వాక్యాలను చదివి తప్పు, ఒప్పులను గుర్తింపచేయడం.
• బెల్లంతో చేసే వంటకాల వివరాలు సేకరింపజేయడం, వాటి గురించి రాయించడం.
• గేయ సారాంశాన్ని స్వంత మాటల్లో రాయించడం.
బోధనాభ్యసన సామగ్రి
1. పాఠ్యపుస్తకం    2. పిల్లల నోట్ బుక్స్    3. పదాలు రాసి ఉంచిన చీటీలు    4. వాక్యాలు రాసి ఉంచిన చీటీలు
 ఆట - 1
• తరగతిలోని పిల్లల పుస్తకాలన్నీ గదిలో ఒక ప్రక్కగా పెట్టించాలి.
• పిల్లలందరినీ వలయాకారంలో నిలబెట్టాలి.
• రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగా నిల్చున్నచోటే పిల్లలు పరుగెత్తుతున్నట్లుగా కాళ్ళు కదపాలి.
• 1వ చీటీలో ఇష్టమైన వంటకాలు, 2వ చీటీలో తీయని పండ్లు, 3వ చీటీలో పుల్లని పండ్లు, 4వ చీటీలో కారంతో చేసిన వంటకాలు అని రాసి ఉంచుకోవాలి.
• ఆ చీటీలను మడత పెట్టి విద్యార్ధుల మధ్యలో ఉంచాలి.
• రేడియో టీచరు సూచనలకు అనుగుణంగా ఒక్కొక్క విద్యార్థిచే ఒక్కొక్క చీటీ తీయించాలి.
• ఆ విద్యార్థిచే చీటీలోని విషయం పై రెండు మూడు వాక్యాలు చెప్పించాలి.
ఆట - 2
• పిల్లలందరూ వృత్తాకారంలో నిలబడి ఉండాలి.
• రేడియో టీచర్ చెప్పే వాక్యం వినాలి.
• ఆ వాక్యం తప్పయితే పిల్లలు ఉన్నచోట నుండి వెనుకకు దూకాలి.
• రేడియో టీచర్ చెప్పిన వాక్యం ఒప్పయితే పిల్లలు ఉన్నచోటు నుండి ముందుకు దూకాలి.
• సరిగా దూకని వారు ఆటలో ఓడిన వారి క్రింద లెక్క.
ప్రసార పూర్వ కృత్యాలు:
అ) రేడియో పాఠాన్ని వినడానికి పిల్లలను సిద్ధపరచాలి.
ఆ) కార్యక్రమానికి కావలసిన బోధనోపకరణలను సమకూర్చుకోవాలి.
ఇ) కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించేవిధానం తెలియాలి.
కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాల నిర్వహణ పై అవగాహన కలిగియుండాలి.
కృత్యం-1
• సంభాషణల ద్వారా విన్న పాఠ్యాంశం పై రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు పిల్లలచే సమాధానాలు చెప్పించాలి.. పిల్లలు తాము చెప్పిన సమాధానాలను రాజు, లతల సమాధానాలతో సరిపోల్చుకొనేలా చూడాలి.
కృత్యం - 2
• పిల్లలు పాఠ్యపుస్తకంలోని 81వ పేజీ తెరవాలి
• దానిలో 'బుగ్గల లోపల ... నుండి ... ఆపజాలవా?' అన్న పదం వరకు పిల్లలచే చదివించాలి.
• రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు పిల్లలచే సమాధానాలు చెప్పించాలి.
పాఠం పై గేయం :
• పాఠం పై ఉన్న “లడ్డూ బాధ" సంబంధించిన గేయాన్ని చార్డు పై రాసి అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించండి.
• గేయాన్ని రెండవసారి వచ్చునపుడు  సామూహికంగా చార్టును చూస్తూ పాడించండి.
పాట
కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.
పల్లవి :
బ్రహ్మ వద్దకు బెల్లం లడ్డూ
ఉరుకులు పరుగులు తీసింది
లోకంలో తనకొచ్చిన బాధలు
ఏకరువు పెట్టింది ఏడుస్తూ   //బ్రహ్మ వద్దకు//
చరణం 1:
తాతయ్యలకు ముసలమ్మలకు
తానే అలుసయ్యానంది
చిన్నవారికీ పెద్దవారికీ
చిదిమే బుద్ధి ఏలంది    //బ్రహ్మ వద్దకు//
చరణం 2:
ఈగలు చీమలు వాలాయంటే
ఇంగిత జ్ఞానం లేదంది
బుద్ది గల్గినా పద్దతి లేని
మనుషుల పనులు తప్పంది   //బ్రహ్మ వద్దకు//
చరణం 3:
బంగరు రంగూ లడ్డూ అంటూ
బ్రహ్మగారు వర్ణించారు
ఎక్కువ సేపు ఇక్కడ ఉంటే
నోట్లో వేస్తా నన్నారు     //బ్రహ్మ వద్దకు//
పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :