Monday, November 11, 2019

These 4 ration updating services stopped in meeseva



Read also:

ఏపిలో ‘మీ సేవ’ అందిస్తున్న సేవల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మీసేవలో రేషన్ కార్డుకు సంబంధించిన 4 రకాల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మీసేవ కేంద్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ నోటీసులు ఇచ్చే వరకు రేషన్ కార్డుకు సంబంధించిన నాలుగు రకాల సేవల్ని చేయడానికి వీలులేదని కమిషనర్ అదేశాలు జారీ చేశారు.

These 4 ration updating services stopped in meeseva

Details of the suspended services:

1. రేషన్ కార్డులో పేర్లు కలపడం
2. రేషన్ కార్డులో పేర్లను డిలీట్ చేయడం
3. రేషన్ కార్డు మైగ్రేషన్
4. రేషన్ కార్డు ట్రాన్స్ ఫర్
ప్రస్తుతం పైన తెలిపిన నాలుగు సర్విసులను మీ సేవా సెంటర్లో కొన్ని రోజుల వరకు నిలిపివేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఏపీలో అక్రమ రేషన్ కార్డుల ఏరివేతకు నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.39 లక్షల తెల్ల రేషన్ కార్డుల్ని ఇనియాక్టివేట్ చేసింది. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ.తెల్ల రేషన్ కార్డులు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల రేషన్ కార్డుల్ని రద్దు చేసింది. వారందరికీ కార్డులు ఉంటాయి గానీ రేషన్ అందదు. వేతనాల, బిల్లుల చెల్లింపులో పారదర్శకత కోసం ప్రభుత్వం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ( CFMS) తీసుకొచ్చింది. ఇప్పుడు సీఎంఎఫ్ఎస్ అనర్హుల గుర్తింపునకు అస్త్రంగా మారుతోంది.
CFMS ద్వారా జీతాలు పొందుతున్న ఉద్యోగుల రేషన్ కార్డులు తొలగించబడినవి!  మీ రేషన్ కార్డు Active /in active తెలుసుకునేందుకు కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి desktop site లో ఉంచి search ration card నందు మీ రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తే మీ రేషన్  కార్డు పూర్తి వివరాలతో చూపబడుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :