Wednesday, November 20, 2019

SBI minimum balance rules



Read also:

➧దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో సేవింగ్స్ అకౌంట్ సర్వీసులు కూడా ఒక భాగం. అయితే ఎస్‌బీఐలో అకౌంట్ కలిగిన వారికి డిపాజిట్, క్యాష్ విత్‌డ్రా.
➧లోన్, చెక్‌బుక్ వంటి పలు సేవలతో పాటు చార్జీలు బాదుడు కూడా ఉంటుంది.
➧స్టేట్ బ్యాంక్ కస్టమర్లు వారి సేవింగ్స్ అకౌంట్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ (ఏఎంబీ)ను కలిగి ఉండాలి. లేదంటే చార్జీలు చెల్లించుకోవలసి వస్తుంది. మెట్రో, పట్టణాలు, గ్రామాల్లోని బ్రాంచుల ప్రాతిపదికన పెనాల్టీ మొత్తం మారుతుంది. అందుకే ఎస్‌బీఐలో అకౌంట్ ఉన్న వారు మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్ రూల్స్‌ గురించి తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం..
➧మెట్రో లేదా పట్టణ ప్రాంతాల్లోని ఎస్‌బీఐ బ్రాంచుల్లో సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు రూ.3,000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్‌ను కలిగి ఉండాలి.
➧సెమీ అర్బన్ బ్రాంచ్‌‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో అకౌంట్ కలిగినవారు రూ.2,000 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.
➧గ్రామీణ ప్రాంతాల్లో స్టేట్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా కలిగిన కస్టమర్లు వారి అకౌంట్లలో రూ.1,000 మంత్లీ బ్యాలెన్స్ ఉండేటా చేసుకోవాలి.
➧అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి లేకపోతే ఎస్‌బీఐ రూ.10 నుంచి రూ.15 వరకు పెనాల్టీని వసూలు చేస్తోంది. దీనికి జీఎస్‌టీ అదనం. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంక్ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది.
➧అదే పాక్షిక పట్టణ ప్రాంతాల్లోని ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే అప్పుడు రూ.7.5 నుంచి రూ.12 వరకు చార్జీలు చెల్లించుకోవాలి. దీనికి GST అదనం.
➧ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో అకౌంట్ కలిగిన వారు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి లేకపోతే అప్పుడు రూ.5 నుంచి రూ.10 వరకు పెనాల్టీలు పడతాయి. దీనికి కూడా జీఎస్‌టీ అదనంగా చెల్లించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :