Sunday, November 3, 2019

Rural Doc Sevak Post Selection Method



Read also:

గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఎంపిక విధానం క్రింది వివరించబడిన విధంగా జరుగుతుంది అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఎంపిక విధానం

▪ 10వ తరగతిలో సాధించిన మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటుంది ఇండియా పోస్ట్.
▪ ఇంటర్, డిగ్రీ, పీజీ చదివినవారు దరఖాస్తు చేసుకున్నా వారికి ఎలాంటి వెయిటేజీ లభించదు.
▪ కేవలం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
▪ ఎవరికైనా మెమోలో మార్కులు, గ్రేడ్స్ ఉంటే మార్కులతోనే అప్లై చేయాలి. ఒకవేళ గ్రేడ్స్‌తో అప్లై చేస్తే అనర్హులుగా గుర్తించే అవకాశముంది. ఒకవేళ మీ మెమోలో గ్రేడ్స్ లేదా పాయింట్స్ మాత్రమే ఉంటే వాటితో మార్కులను లెక్కిస్తారు.
▪ ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు మార్కులు సమానంగా ఉంటే డేట్ ఆఫ్ బర్త్(ఎక్కువ వయస్సు ఉన్నవారికే మెరిట్), ఎస్‌టీ ఫీమేల్, ఎస్‌సీ ఫీమేల్, ఓబీసీ ఫీమేల్, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్, అన్‌రిజర్వ్‌డ్ ఫీమేల్, ఎస్‌టీ మేల్, ఎస్‌సీ మేల్, ఓబీసీ మేల్, ఈడబ్ల్యూఎస్ మేల్, అన్‌రిజర్వ్‌డ్ మేల్ ఆర్డర్‌లో మెరిట్ నిర్ణయిస్తారు.
▪ ఒక అభ్యర్థి గరిష్టంగా 20 పోస్టులకు అప్లై చేయొచ్చు. అంటే ఒక సర్కిల్ లేదా మొత్తం సర్కిళ్లలో ఒక అప్లికేషన్ ద్వారా 20 పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
▪ అభ్యర్థి సొంత రాష్ట్రం, ప్రాంతంలో ఎంచుకున్న పోస్టులు కూడా ఇందులోనే ఉంటాయి. అందుకే దరఖాస్తు చేసే సమయంలో 20 ప్రాంతాలను సరిగ్గా ఎంచుకోవాలి.
▪ ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినా చివరకు ఒక పోస్టునే కేటాయిస్తుంది ఇండియా పోస్ట్.
▪ ఒకవేళ ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల మెరిట్ లిస్ట్‌లో టాప్‌లో ఉంటే ప్రాధాన్యతా క్రమంలోని మొదటి పోస్టునే కేటాయిస్తారు.
▪ మిగతా పోస్టులను వదులుకోవాలి. అభ్యర్థులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
▪ దరఖాస్తులో సమాచారం పూర్తిగా వెల్లడించకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశముంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :