Saturday, November 16, 2019

Pradhan Mantri Awas Yojana scheme details



Read also:

మీరు ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి . లాగిన్ చేసిన తర్వాత సిటిజన్ అసెస్మెంట్లో మీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Pradhan-Mantri-Awas-Yojana
Pradhan-Mantri-Awas-Yojana
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన.భారతీయులందరికీ సొంత ఇంటి కల నెరవేర్చేందుకు 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. 2022 నాటికి దేశ ప్రజలందరికీ పక్కా ఇళ్లు ఉండటమే ఈ పథకం లక్ష్యం. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అర్బన్, రూరల్ ప్రాంతాలకు వర్తిస్తుంది. వార్షికాదాయం రూ.18 లక్షల లోపు ఉన్నవాళ్లంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పథకానికి మహిళలు దరఖాస్తు చేస్తే ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ పథకానికి వచ్చిన అప్లికేషన్లలో కొన్ని దరఖాస్తులకు మాత్రమే ఆమోదం పడుతుంది. మహిళలకు ప్రత్యేకమైన వడ్డీ రేట్లు, అదనపు ప్రయోజనాలు ఉంటాయి. చాలా బ్యాంకులు మహిళలకు హోమ్ లోన్‌పై తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి. మహిళలు 8.25 వార్షిక వడ్డీకే ఇంటి రుణం తీసుకోవచ్చు. రూ.1 లక్షకు నెలకు రూ.853 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 20 ఏళ్ల కాలవ్యవధికి లోన్ తీసుకోవచ్చు. ఈ పథకం కింద రూ.70 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా తీసుకుంటే ఎలాంటి ప్రీ-పేమెంట్ ఛార్జీలు ఉండవు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఇందులో నాలుగు కేటగిరీలున్నాయి. 

  • రూ.3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు ఆర్థికంగా బలహీన వర్గాల పరిధిలోకి
  • రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వార్షికాదాయం ఉన్నవాళ్లు లోయర్ ఇన్‌కమ్ గ్రూప్(ఎల్ఐజీ) పరిధిలోకి
  • రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఉంటే మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్(ఎంఐజీ-1)లో
  • రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉంటే మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్(ఎంఐజీ-2)లోకి వస్తారు.
మీరు ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత సిటిజన్ అసెస్‌మెంట్‌లో మీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన వివరాలను మీరు హోమ్ లోన్ తీసుకునే బ్యాంకును అడిగి కూడా తెలుసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :